పెద్దజాలరిపేటలో రింగ్‌ వలల వివాదం- అప్రమత్తమైన పోలీసులు - మరోసారి రింగ్ వలల వివాదం

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 16, 2024, 12:21 PM IST

Ring Nets Controversy in Visakha: విశాఖ జిల్లా పెద్దజాలరిపేటలో మరోసారి రింగ్‌ వలల వివాదం రాజుకుంది. వాసవానిపాలేనికి చెందిన మత్స్యకారులు రింగ్‌ వలలతో వేటకు వెళ్లేందుకు సిద్దమైనట్లు సమాచారం తెలియడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. గతంలో రింగ్ వలల వివాదం, తలెత్తిన ఘర్షణల నేపథ్యంలో వాసవానిపాలెం, పెద్దజాలరిపేట మత్స్యకార నాయకులతో పోలీసులు సమావేశం అయ్యారు. ఏ సమయంలోనైనా మత్స్యకారులు వేటకి వెళ్లే అవకాశం ఉందని భావించిన పోలీసులు ముందుగా జాగ్రతగా ఇరు గ్రామాల వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు.

గతంలో కొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు వాసవానిపాలెం తీరంలో ఉంచిన బోట్ల వద్దకు చేరుకుని రింగ్‌ వలలకు పెట్రోల్‌ పోసి తగలబెట్టారు. తీరంలో ఉంచిన బోట్ల నుంచి మంటలు రావడాన్ని గమనించిన వాసవానిపాలెం మత్స్యకారులు మంటల్ని ఆర్పివేశారు. సుమారు 6 పడవల్లో వలలను తగలబెట్టగా వాటిలో మూడు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఇదంతా పెదజాలారిపేటకు చెందిన వారే చేశారని సమీప తీరంలో అనుమానాస్పదంగా ఉన్న ముగ్గురు మత్స్యకారులున్న పడవలను వాసవానిపాలెం తీరానికి తీసుకువచ్చారు. వారిని పోలీసులకు అప్పగించారు. రింగ్‌ వలలకు నష్టం కలిగించిన వారిపై చర్యలు తీసుకోని మాకు నష్టపరిహారం చెల్లించాలంటూ వారు పట్టుబట్టారు.  ఈ ఘటన నేపథ్యంలో పోలీసులు ముందస్తుగా గ్రామాల్లో బందోబస్తు ఏర్పాటు చేశారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.