శివ శివా ఇదేం పని - శివరాత్రి రోజు రికార్డింగ్ డ్యాన్సులా!

By ETV Bharat Telangana Team

Published : Mar 10, 2024, 10:18 AM IST

thumbnail

Recording Dance At Maha Shivaratri Celebrations in Nalgonda : సాధారణంగా మహా శివరాత్రి సందర్భంగా చాలా మంది ఆ రోజు రాత్రి జాగారం చేస్తూ దైవ నామస్మరణలో ఉంటారు. కానీ నల్గొండ జిల్లా అడవిదేవులపల్లి ప్రాంతంలో మాత్రం రికార్డింగ్ డ్యాన్సులు ఏర్పాటు చేశారు. అయితే ఇవి అధికార పార్టీ నేతల కనుసన్నల్లో జరిగాయనే విమర్శలున్నాయి. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్​గా మారాయి. 

పోలీసుల వద్ద సాంస్కృతిక కార్యక్రమాల కోసం మైక్ పర్మిషన్ తీసుకున్న అధికార పార్టీకి చెందిన నాయకులు ఆంధ్ర నుంచి తీసుకొన యువతులతో అశ్లీల నృత్యాలు చేయించడంతో ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. తెలంగాణలో రికార్డింగ్ డ్యాన్సులకు పర్మిషన్ లేకున్నా పోలీసులు చూసి చూడనట్లు వదిలేయడంతో వీరికి కన్నసన్నుల్లోనే రికార్డింగ్ డాన్సులు జరుగుతున్నాయని గ్రామస్తులు వాపోతున్నారు. ఇలాంటి కార్యక్రమాల వల్ల గ్రామాల్లో యువత తప్పుడుమార్గం పట్టే అవకాశం ఉందని ఇకనైనా రాజకీయ నాయకులు తమ ఉనికిని కాపాడుకొనే ఇలాంటి ప్రలోభాలకు పోలీసులు గురికాకుండా రికార్డింగ్ డాన్సులు, అశ్లీల నృత్యాలు జరగకుండా  కఠినమైన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.