ఐసీయూలో చికిత్స పొందుతున్న రోగిని కరిచిన ఎలుకలు - కాళ్లు, చేతులకు తీవ్ర రక్తస్రావం - Rat Infestation Kamareddy news
🎬 Watch Now: Feature Video
Published : Feb 11, 2024, 11:42 AM IST
Rat Infestation Government Hospital In Kamareddy : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మెడికల్ హాస్పిటల్లో ఐసీయూలో చికిత్స పొందుతున్న పేషెంట్ను ఎలుకలు కరిచాయి. షేక్ ముజీబ్ అనే వ్యక్తి అనారోగ్యానికి గురి కావడంతో, గత వారం రోజులుగా ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. పేషెంట్ కాళ్లు, చేతులకు ఎలుకలు కరవడంతో తీవ్ర రక్తస్రావానికి గురయ్యాడు. గమనించిన పేషెంట్ కుటుంబసభ్యులు వెంటనే చికిత్స చేస్తున్న డాక్టర్లకు, నర్సులకు సమాచారం ఇచ్చారు. ఎలుకలు సంచరించడంతో ఐసీయూలో చికిత్స పొందుతున్న పేషెంట్లు, వారి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.
Rat Infestation In Kamareddy : ఐసీయూలోని పీయూపీ భాగం దెబ్బతినడంతో ఆ రంధ్రం గుండా ఎలుకలు లోపలికి వస్తున్నాయని రోగులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా హాస్పిటల్ సిబ్బంది ఎలుకలను పట్టుకొని, పేషెంట్లకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలంటూ కోరుతున్నారు. గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగాయని, కనీసం భవిష్యత్తులోనైనా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.