పనిలోనే విశ్రాంతి - జూన్ 4వ తేదిన ఎన్నికల ఫలితాలను వీక్షిస్తున్న రామోజీరావు - Ramoji Rao conducted review meeting with employees
🎬 Watch Now: Feature Video
Ramoji Rao Conducted Review Meeting with Eenadu ETV Employees : పనిలోనే తనకు విశ్రాంతి అనేది రామోజీ గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు నమ్మిన సిద్ధాంతం. అందుకు అనుగుణంగానే ఆయన అనునిత్యం పరిశ్రమించేవారు. ప్రజాహితమే అభిమతంగా దిశానిర్దేశం చేసేవారు. జూన్ 4న ఎన్నికల ఫలితాల రోజు కూడా ఈనాడు, ఈటీవీ ఉన్నతోద్యోగులతో సమీక్ష నిర్వహించారు. ఆఖరిశ్వాస వరకు కర్తవ్య నిర్వహణలో విశ్రమించలేదు. అయితే జాన్ 5న ఆయనకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవడంలో ఆసుపత్రిలో చేరారు. ఆరోగ్యం విషమంగా ఉండడంతో చికిత్స పొందుతూ ఈరోజు తెల్లవారు జామున 4.50 గం.కు తుదిశ్వాస విడిచారు. అనంతరం ఫిల్మ్‌సిటీలోని నివాసానికి రామోజీరావు పార్థివదేహం తరలించారు.
రామోజీరావు పార్థివదేహానికి నివాళులర్పించేందుకు రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం శ్రేణులతో పాటు వివిధ రాజకీయపార్టీలు, జర్నలిస్టులు, ప్రజాసంఘాలు తరలి వచ్చారు. రామోజీరావు మరణం పాత్రికేయ రంగానికి తీరని లోటంటూ అంజలి ఘటించారు. ఉక రామోజీ ఫిల్మ్‌సిటీలో రేపు ఉదయం 9 నుంచి 10 గంటల మధ్య రామోజీరావు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహిస్తామని ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది.