రామోజీరావు స్వస్థలంలో విషాద ఛాయలు - అక్షరయోధుడి సేవలను గుర్తుచేసుకుంటూ గ్రామస్థుల కంటతడి - Ramoji Rao Passed Away

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Jun 8, 2024, 6:41 PM IST

Ramoji Rao Passed Away : రామోజీరావు మరణంతో ఆయన స్వస్థలం ఏపీలోని కృష్ణాజిల్లా పెదపారుపూడిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఒక సామాన్య రైతు కుటుంబంలో పుట్టి అసామాన్య విజయాలు సాధించిన ఆయన మరణం తీవ్ర ఆవేదనకు గురిచేసిందని పెదపారుపూడి గ్రామస్థులు వాపోయారు. రామోజీరావుతో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ కంటతడి పెట్టారు. తమ గ్రామాన్ని దత్తత తీసుకుని సీసీ రోడ్లు, పాఠశాలలు, వ్యవసాయ సహకార కేంద్రం, పశువైద్య శాల, చెరువు సుందరీకరణ వంటి అభివృద్ధి కార్యక్రమాలు రామోజీరావు చేపట్టారని తెలిపారు. 

వీటితోపాటు ఇంటింటికీ కుళాయి నీళ్లు, మరుగుదొడ్లు నిర్మించడంతో పాటు వీధి దీపాలు ఏర్పాటు చేశారన్నారు. రామోజీరావు ప్రాథమిక విద్య అంతా పెదపారుపూడి గ్రామంలోనే సాగిందని స్థానికులు చెబుతున్నారు. అలాంటి గొప్ప వ్యక్తి మరణం తమ గ్రామానికి తీరని లోటు అని, ఆయన మరణవార్తను జీర్ణించుకోలేకపోతున్నామని గ్రామస్థులు కన్నీరు మున్నీరయ్యారు. రామోజీరావు సొంత నిధులతో స్వగ్రామానికి ఎన్నో సేవలు చేశారని, యువతకు ఉపాధి కల్పించే దిశగా కృషి చేశారని స్థానిక ఎమ్మెల్యే వర్ల కుమార్‌ రాజా తెలిపారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.