రామోజీ గ్రూప్ స్పోర్ట్స్ మీట్ ప్రారంభించిన ఫిల్మ్ సిటీ ఎండీ విజయేశ్వరి - Ramadevi Public School
🎬 Watch Now: Feature Video
Published : Feb 27, 2024, 6:24 PM IST
|Updated : Feb 27, 2024, 6:59 PM IST
Ramoji Group Sports Meet 2024 : రమాదేవి పబ్లిక్ స్కూల్ క్రీడా ప్రాంగణంలో రామోజీ గ్రూప్ స్పోర్ట్స్ మీట్ - 2024ను రామోజీ ఫిల్మ్ సిటీ ఎండీ సీహెచ్ విజయేశ్వరి ముఖ్యఅతిథిగా విచ్చేసి జ్యోతి వెలిగించి ప్రారంభించారు. గాలిలోకి బెలూన్లు వదిలి క్రీడా సంబురాలకు ఘనంగా శ్రీకారం చుట్టారు. అనంతరం క్రీడా జ్యోతిని వెలిగించి క్రీడాకారులకు అందజేశారు. క్రికెట్ పోటీలకు టాస్ వేసిన ఫిల్మ్ సిటీ ఎండీ విజయేశ్వరి స్వయంగా బ్యాట్ చేతపట్టి క్రికెట్ ఆడి ఉద్యోగులను ఉత్సాహపరిచారు. ఉద్యోగినులతో కలిసి మ్యూజికల్ చైర్, త్రోబాల్, టెన్నికాయిట్ ఆడారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న రామోజీ ఫిల్మ్ సిటీ సీఈఓ కె.శేషసాయి మాట్లాడుతూ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన రామోజీ గ్రూప్ స్పోర్ట్స్ మీట్లో ఉద్యోగులు ఉత్సాహంగా పాల్గొంటున్నారని అన్నారు. క్రీడా స్ఫూర్తిని చాటుతూ పోటీల్లో పాల్గొంటున్న ఉద్యోగులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో యూకేఎంపీఎల్ డైరెక్టర్ ఎం. శివరామకృష్ణ, రామోజీ గ్రూప్ మానవ వనరుల విభాగం ప్రెసిడెంట్ డా.ఏ.గోపాలరావు, హార్టికల్చర్ విభాగం వైస్ ప్రెసిడెంట్ డా.ఆర్.చంద్రశేఖర్, ఇతర ఉన్నత ఉద్యోగులు పాల్గొన్నారు.