ఆరడుగుల కాన్వాస్‌పై రామాయణపర్వం - మహబూబాబాద్ చిత్రకాడి అద్భుత కళాఖండం
🎬 Watch Now: Feature Video
Ramayan on canvas : అయోధ్య రాముడిపై భక్తులు ఒక్కో విధంగా తమ భక్తిని చాటుకుంటున్నారు. ఒకరు బంగారాన్ని సమర్పిస్తే, మరొకరు ఇంకోరకమైన కానుక అందజేస్తున్నారు. అయోధ్యలో బాలరాముడికి ప్రాణ ప్రతిష్ఠ జరిగిన వేళ మహబూబాబాద్ జిల్లా కొమ్మల వంచ గ్రామానికి చెందిన చిత్రకారుడు కూడా రామ్ లల్లా కోసం ఓ అద్భుతమైన కళాఖండాన్ని రూపొందించారు. ప్రముఖ చిత్రకారుడు వెంకటేశ్ కందునూరి "పర్యావరణ హితం రామాయణ ఘట్టం" పేరుతో ఆరడుగుల క్యాన్వాస్పై రామాయణంలోని ప్రధాన ఘట్టాలను అత్యద్భుతంగా చిత్రీకరించి శ్రీరాముడిపై భక్తిని చాటుకున్నారు.
Ramayan Main Scenes on Six Feet Canvas : సుమారు 6 నెలలపాటు శ్రమించి రామాయణ ఘట్టాన్ని వెంకటేశ్ ఒకే చిత్రపటంలో తీర్చిదిద్దిన తీరు ఔరా అనిపిస్తోంది. అంతేకాకుండా సమస్త సృష్టికి ఆధార భూతమైన భూమి పట్ల మానవాళి కృతజ్ఞతతో ఉంటే ప్రకృతి ఆశీర్వాదం లభిస్తుందనే సందేశాన్ని రామాయణ చిత్ర పటంలో వివరించారు. ఈ చిత్ర పటాన్ని అయోధ్య రామతీర్థ ట్రస్ట్‌కు బహుమతిగా ఇవ్వనున్నట్లు వెంకటేశ్ తెలిపారు.