భారీ వర్షాలకు గోదావరి పరవళ్లు- దిగువకు 3.50 లక్షల క్యూసెక్కుల నీటి విడుదల - Rain Water was Released To Yanam - RAIN WATER WAS RELEASED TO YANAM
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 19, 2024, 4:40 PM IST
Rain Water was Released at Dowleswaram Cotton Barrage : ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరిలో నీటిమట్టం గంటకు వేల క్యూసెక్కులు పెరుగుతోంది. తూర్పు గోదావరి జిల్లాలోని ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద నీటిమట్టం 10.8 అడుగులకు చేరుకుంది. దీంతో కాటన్ బ్యారేజ్ వద్ద అన్ని గేట్లను ఎత్తి ఎగువ నుంచి వస్తున్న వర్షపు నీటిని సముద్రంలోకి వదులుతున్నారు. దీంతో బ్యారేజీ నుంచి ఒకేసారి మూడున్నర లక్షల క్యూసెక్కుల వరద నీటిని వదలటంతో నదీ పరీవాహక ప్రాంతాల చుట్టూ ఎర్రనీరే కనిపిస్తుంది.
దిగువకు నీటిని విడుదల చేయడంతో కాకినాడ జిల్లాలో అంతర్భాగంగా ఉన్న కేంద్రపాలిత ప్రాంతం యానాంకు ఆనుకుని ప్రవహించే గౌతమి నది పరవళ్లు తొక్కుతూ సముద్ర వైపు ప్రవహిస్తోంది. ప్రస్తుతం సముద్రంలో పోటు సమయం కావడంతో వేగంగా నీరు తరలిపోతుంది. సాయంత్రం నుంచి అర్ధరాత్రిలోపు ప్రవాహ వేగం తగ్గి నీటిమట్టం పెరిగే అవకాశం ఉంది. వరద ప్రవాహానికి మత్స్యకారులు తమ నావలు కొట్టుకుపోకుండా తాళ్లతో లంగరు వేసి కాపాడుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.