సికింద్రాబాద్​లో కుండపోత వర్షం- తాడ్​బండ్​ హనుమాన్ ఆలయంలో వరదనీరు - Rain Water Enters Into Temple

🎬 Watch Now: Feature Video

thumbnail

Rain Water Enters Into Hanuman Temple : హైదరాబాద్​లోని సికింద్రాబాద్ తాడ్​బండ్ హనుమాన్ దేవాలయంలోకి వర్షపునీరు చేరింది. ఇటీవల నూతనంగా నిర్మించిన ధ్వజస్తంభం పైకప్పు నుంచి వర్షపు నీరు పడుతుండటంతో ఆలయమంతా జలమయమయింది. వర్షం నీరు వరదలా వస్తుండడంతో హను​మాన్​ దర్శనానికి వచ్చే భక్తులకు ఇబ్బందులు పడ్డారు. ధ్వజస్తంభం గర్భగుడి చుట్టుపక్కల ఆలయ ప్రాంగణం వర్షపు నీటితో నిండింది. ఆలయ అధికారులు నీటిని తొలగించేందుకు చర్యలు చేపట్టారు.  

Heavy Rains In Hyderabad : హైదరాబాద్​లో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. నిన్నటి వరకు భానుడి ప్రతాపంతో అల్లాడిన ప్రజలకు వర్షంతో కాస్త ఉపశమనం లభించింది. అయితే నగరంలో పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడ్డాయి. దీంతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. మరోవైపు ట్రాఫిక్​కు అంతరాయం కలిగింది. జీహెచ్​ఎమ్​సీ పరిధిలోని పటాన్​చెరు, కూకట్​పల్లి, శేరిలింగంపల్లి, గచ్చిబౌలిలోని పలు ప్రాంతాల్లో వడగండ్ల వర్షం కురిసింది. రహదారులపై వర్షంనీరు నిలిచిన చోట మ్యాన్​హోల్స్​ను తెరిచి నీటిని మళ్లిస్తున్నారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.