విజయవాడ డివిజన్ పరిధిలో 14 రైళ్లు రద్దు- రైల్వే వెబ్‌సైట్‌లో వివరాలు - Railway Officials Canceled Trains

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 17, 2024, 9:46 PM IST

Railway Officials Canceled 14 Trains Due to Track Repairs: విజయవాడ రైల్వే డివిజన్ (Vijayawada Railway Division) పరిధిలో పలు ప్రాంతాల్లో ట్రాక్ మరమ్మతుల కారణంగా 14 రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. శుక్రవారం నుంచి జూన్ 4వ తేదీ వరకు కేటాయించిన తేదీల్లో కొన్ని రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. రాజమహేంద్రవరం నుంచి విశాఖపట్నం, మచిలీపట్నం నుంచి విశాఖపట్నం, తిరుపతి నుంచి కాకినాడ వెళ్లే రైళ్లును రద్దు చేశారు. గుంటూరు నుంచి విశాఖపట్నం, గుంటూరు నుంచి రాయగడ, విశాఖ నుంచి మహబూబ్ నగర్ తదితర ప్రాంతాలకు వెళ్లే రైళ్ల సర్వీసులను అధికారులు నిలిపివేశారు. రద్దు అయిన రైళ్ల వివరాలను రైల్వే శాఖ వెబ్ సైట్​లో అందుబాటులో ఉంచామని ప్రయాణికులు గమనించాలని రైల్వే అధికారులు తెలిపారు. 

  • రాజమహేంద్రవరం - విశాఖపట్నం
  • మచిలీపట్నం - విశాఖపట్నం
  • తిరుపతి - కాకినాడ
  • గుంటూరు - విశాఖపట్నం
  • గుంటూరు - రాయగడ
  • విశాఖ - మహబూబ్ నగర్

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.