కుమురంభీం ఆసిఫాబాద్ అడవుల్లో చెట్టు ఎక్కుతూ 15 అడుగుల కొండచిలువ - సోషల్ మీడియాలో వీడియో వైరల్ - Python Virial Video In Adilabad - PYTHON VIRIAL VIDEO IN ADILABAD
🎬 Watch Now: Feature Video
Published : Jul 17, 2024, 5:36 PM IST
Python Viral Video In Adilabad Forest : కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండలం మానిక దేవర అటవీ ప్రాంతంలో ఓ భారీ కొండచిలువ చెట్టు ఎక్కుతూ కనిపించింది. అడవిలో పశువులను మేపడానికి వెళ్లిన పశువుల కాపర్లు కొండ చిలువను చూసి సెల్ ఫోన్లలో దృశ్యాన్ని చిత్రీకరించారు. సెల్ ఫోన్లలో చిత్రీకరించిన దృశ్యాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఆ వీడియో కాస్త వైరల్ అవుతుంది. వర్షాకాలం వాతావరణం చల్లగా ఉండడంతో కొండచిలువ బయటికి వచ్చి అటవీ ప్రాంతంలో స్వేచ్ఛగా తిరుగుతోందని పలువురు చెబుతున్నారు.
మరోవైపు మహబూబాబాద్ కొత్తగూడ మండలం వేలుబెల్లి పెద్ద చెరువులో 15 అడుగుల కొండ చిలువ లభ్యమైంది. మత్స్యకారులు చేపలు పట్టేందుకు చెరువులో వల ఏర్పాటు చేసారు. ఉదయం వెళ్లి చూడగా అందులో కొండచిలువ కనిపించింది. దీంతో చేపలు పట్టేవారు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అధికారులు కొండ చిలువను పట్టుకొని అటవీ ప్రాంతంలో వదిలేశారు.