ఎన్నో ఏళ్ల ఎదురు చూపులకు తెర - భారతరత్న ఎంపికపై పీవీ కుటుంబ సభ్యుల హర్షం - Bharat Ratna PV Narasimha Rao
🎬 Watch Now: Feature Video
Published : Feb 9, 2024, 10:24 PM IST
PV Family Members Happy For Bharat Ratna Announce : ప్రభుత్వం పీవీ నర్సింహారావుకు భారతరత్న ప్రకటించడంతో ఆయన కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. ఆయన కుమారులు, కుమార్తెలు ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలియజేశారు. ఎన్నో ఏళ్ల ఎదురు చూపులకు తెరపడిందని సంబరపడ్డారు. ఈ సందర్భంగా హైదరాబాద్ పీవీ ఘాట్‌లో కుటుంబ సభ్యులు నివాళులు అర్పించారు. అనంతరం మాట్లాడిన కుటుంబ సభ్యులు, ఆర్ధిక సంస్కరణలతో పీవీ నరసింహారావు దేశాన్ని వృద్ధి పథంలో నడిపించారని కొనియాడారు.
పీవీ వేసిన ఆర్థిక పునాది రాళ్లను, ప్రస్తుత కాలంలో ప్రధాని మోదీ ముందుకు తీసుకెళ్లటం గొప్ప విషయమన్నారు. పీవీకి భారతరత్న తెలంగాణకే కాదు యావత్ దేశానికే గర్వకారణమని పేర్కొన్నారు. గొప్ప వ్యక్తులకు సన్మానం మన సంస్కారమని పేర్కొన్నారు. 60 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్న పీవీ, 14 భాషలలో బ్రహ్మాండమైన పాండిత్యం గల మేధావి అని ప్రశంసించారు. పీవీకి భారతరత్న ప్రకటించిన కేంద్ర ప్రభుత్వానికి, పీవీ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.