LIVE: హైదరాబాద్‌లో 'పుష్ప 2' టీమ్ మీడియా సమావేశం - ప్రత్యక్ష ప్రసారం - PUSHPA 2 TEAM PRESS CONFERENCE

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 7, 2024, 6:53 PM IST

Updated : Dec 7, 2024, 7:32 PM IST

Pushpa 2 team press conference: హైదరాబాద్‌లో 'పుష్ప 2' టీమ్ మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. 'పుష్ప 2' విడుదలై భారీగా కలెక్షన్​లు సాధిస్తోంది. అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన 'పుష్ప 2' బాక్సాఫీస్ వద్ద ఇప్పటికే దూసుకుపోతోంది. రిలీజ్​కు ముందే పలు రికార్డులు ఖాతాలో వేసుకున్న 'పుష్ప 2' విడుదల తర్వాత సైతం అదే జోరు ప్రదర్శిస్తంది. డిసెంబర్ 5వ తేదీన రిలీజైన ఈ సినిమా వరల్డ్​వైడ్​గా తొలి రోజే 294 కోట్ల రూపాయలు వసూళ్లు సాధించి, ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే అగ్ర స్థానంలో నిలిచింది. రిలీజ్​కు ముందే బుక్‌ మై షోలో గంటలో లక్ష టికెట్లు అమ్ముడైన సినిమాగా రికార్డు నెలకొల్పిన 'పుష్ప2' విడుదల తర్వాత ఆ రికార్డును అదే బ్రేక్‌ చేసింది. 2వ రోజు కూడా గంటలో లక్షకు పైగా టికెట్స్‌ అమ్ముడయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో నైజాంలో 30 కోట్ల రూపాయల షేర్‌ వసూళ్లు సాధించిన తొలి సినిమాగా 'పుష్ప 2' నిలిచింది. బాలీవుడ్​లోనూ ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఎప్పటినుంచో ఆత్రుతగా ఎదురుచూశారు. బాలీవుడ్‌లో ఈ మూవీకి ఫస్ట్‌డే ఏకంగా 72 కోట్ల రూపాయలు నెట్ కలెక్షన్లు వచ్చాయి. మూవీ విజయ సాధించడంతో 'పుష్ప 2' టీమ్ హైదరాబాద్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ప్రత్యక్ష ప్రసారం. 
Last Updated : Dec 7, 2024, 7:32 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.