LIVE : రెండోరోజు సాగుతున్న పూరీ జగన్నాథుని రథయాత్ర - Puri Jagannath Rath Yatra 2024
🎬 Watch Now: Feature Video
Published : Jul 8, 2024, 9:14 AM IST
|Updated : Jul 8, 2024, 2:48 PM IST
Puri Jagannath Rath Yatra 2024 : ఒడిశా రాష్ట్రంలోని పూరీ జగన్నాథుని విశ్వప్రసిద్ధ రథయాత్ర ఘనంగా జరుగుతోంది. రెండు రోజుల పాటు సాగే ఈ యాత్రలో సుమారు 15 లక్షలకు పైబడి భక్తులు పాల్గొంటున్నారు. అందుకు తగిన ఏర్పాట్లు చేశారు. మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగుకుండా ఆలయ సిబ్బంది ఏర్పాటు చేశారు. మొట్టమొదటసారిగా ఈ వేడుకలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరయ్యారు. ఆమె గవర్నర్ రఘుబర్దాస్తో కలిసి సుభద్రమ్మ రథం లాగారు. ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి, కేంద్రమంత్రులు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. జగన్నాథ, బలభద్ర, సుభద్రలు శ్రీక్షేత్రంలోని రత్నసింహాసనం వీడి యాత్రగా పెంచిన తల్లి గుండిచాదేవి మందిరానికి చేరుకోనున్నారు. ఈసారి రథయాత్రకు ప్రత్యేకత ఉంది. 1971 తర్వాత ఒకేరోజు జగన్నాథుని నవయవ్వన దర్శనం, నేత్రోత్సవం, రథయాత్ర నిర్వహించనున్నారు. మూడు వేడుకలు ఆదివారం ఉండటంతో జగన్నాథుని నందిఘోష్, బలభద్రుని తాళధ్వజ, సుభద్ర దర్పదళన్ రథాలు ఆదివారం సాయంత్రానికి అమ్మ ఆలయానికి చేరుకొనే పరిస్థితి లేదు. అందుకే రెండు రోజుల సమయం.
Last Updated : Jul 8, 2024, 2:48 PM IST