కశ్మీర్‌ను చూడాలనుకుంటున్నారా? - హుస్సేన్‌సాగర్‌కు రండి - special Theme Parks in Hyderabad - SPECIAL THEME PARKS IN HYDERABAD
🎬 Watch Now: Feature Video
Published : May 27, 2024, 6:54 PM IST
Attractive Special Theme parks in Hyderabad : ఎండలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రజలు కాస్త చల్లదనం కోసం వండర్ పార్క్‌ల బాట పడుతున్నారు. వీరి కోసం నగరంలో ప్రత్యేకంగా థీమ్ పార్క్‌లు వెలుస్తున్నాయి. లండన్, కశ్మీర్, స్విట్జర్లాండ్ పేర్లతో థీమ్ పార్క్‌లను ఏర్పాటు చేస్తున్నారు. బయట ఉష్ణోగ్రతలు వేడిగా ఉండటంలో ప్రజలు వీటి వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. సెలవులలో దూర ప్రాంతాలకు వెళ్లలేని వారు ఇలాంటి పార్క్‌లకు కుటుంబ సమేతంగా వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో హైదరాబాద్ హుస్సేన్‌సాగర్ వద్ద మినీ కశ్మీర్ థీమ్ పార్క్‌కు సందర్శకులు బారులు తీరారు. మండు వేసవిలో ఇలాంటి చల్లని పార్క్‌లకు వస్తే రిలాక్స్‌గా ఉంటుందని, పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తారని సందర్శకులు అంటున్నారు. కశ్మీర్ వెళితే ఎలా ఫిల్ అవుతామో అలాగే ఆస్వాదించామని చెబుతున్నారు. మరి మినీ కశ్మీర్ థీమ్ పార్క్ ప్రత్యేకతలేంటి, ప్రజలు ఏమనుకుంటున్నారు అనే విషయాలను వారి మాటల్లోనే తెలుసుకుందాం.