thumbnail

చంద్రబాబు ఇంటి చుట్టూ పీఎస్సార్‌ ఆంజనేయులు చక్కర్లు - PSR Anjaneyulu Tries to MEET CM CBN

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 7, 2024, 6:05 PM IST

PSR Anjaneyulu Tries to MEET CM CBN: హైదరాబాద్‌లో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసేందుకు ఐపీఎస్ అధికారి పీఎస్​ఆర్ ఆంజనేయులు విఫలయత్నం చేశారు. అపాయింట్​మెంట్ లేదని చెప్పినా సీఎం ఇంటి చుట్టూ చక్కర్లు కొట్టారు. జూబ్లీహిల్స్‌లో చంద్రబాబు ఇంటి వద్దకు మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు రెండు సార్లు వెళ్లినట్లు సమాచారం. సమయం ఇచ్చేందుకు ముఖ్యమంత్రి కార్యాలయం నిరాకరించింది. గేటు దగ్గర నుంచే ఆ అధికారిని భద్రతా సిబ్బంది వెనక్కి పంపారు. 

పిలుపు లేకపోయినా, సమయం ఇవ్వక పోయినా చంద్రబాబును కలిసేందుకు వైఎస్సార్సీపీ విధేయులుగా ముద్రపడ్డ అధికారులు విఫలయత్నాలు చేస్తున్నారు. కాగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారనే ఆరోపణలు పీఎస్​ఆర్ ఆంజనేయులు​పై ఉన్నాయి. ఎన్నికల విధుల్లో అవకతవకలకు పాల్పడ్డారని పీఎస్‌ఆర్‌ను ఈసీ తప్పించింది. ఈసీ ఎన్నికల విధులు నుంచి తప్పించిన తరువాత కూడా అనధికారికంగా కూడా వైఎస్సార్సీపీ కోసం ఆంజనేయులు పనిచేశారని ఆరోపణలు వెల్లువెత్తాయి. గతంలోనూ చంద్రబాబును కలిసేందుకు పీఎస్సార్ ఆంజనేయులు ప్రయత్నించారు. అప్పుడు కూడా ఆయనకు నిరాశే ఎదురైంది. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.