ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే మేకపాటికి మరోసారి నిరసన - అడుగడుగునా నిలదీసిన మహిళలు - Protest to MLA Mekapati Vikram - PROTEST TO MLA MEKAPATI VIKRAM
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 27, 2024, 10:39 PM IST
Protest to YSRCP MLA Mekapati Vikram Reddy : మే 13 న పోలింగ్ తేదీ కావడంతో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు ఎన్నికల ప్రచారానికి ప్రజల్లోకి వస్తున్నారు. కానీ వారికి సమస్యలే స్వాగతం పలుకుతున్నాయి. గతంలో ఓ సారి ఓటు అడగడానికి వచ్చారని ఐదేళ్ల తర్వాత మరలా ఓటు 'అడుక్కోడానికే' వచ్చారని ప్రజలు ఎద్దేవా చేస్తున్నారు. 2019లో గెలిచిన తర్వాత తమ ముఖం చూసిన పాపాన పోలేదని, సమస్యల గురించి పట్టించుకునే నాథుడే కరువయ్యారని నిప్పులు చెరిగారు. ఇటీవలే వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, అవంతి శ్రీనివాస్‌కి నిరసన సెగ ఎదురైంది. వారిని సమస్యలపై నిలదీశారు. నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం చినమాచనూరులో ఈ నెల 22 వ తేదీ మేకపాటి విక్రమ్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించగా వీధి దీపాలు కూడా వేయలేని మీకు రాజకీయాలు ఎందుకని ప్రజలు ప్రశ్నించారు. ఈ ఘటన వరుక ముందే మరోసారి అదే పరిస్థితి ఎదురైంది.
MLA Mekapati Vikram Reddy Election Campaign : జిల్లాలోని సంగం మండలం దువ్వూరు గ్రామంలో ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. స్థానిక సమస్యలపై ఎమ్మెల్యేను సమస్యలపై అడుగడుగున అడ్డుకుంటున్న మహిళలను పక్కకు తీసుకెళ్లిన వైఎస్సార్సీపీ నేతలు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. స్థానిక కృష్ణుని దేవాలయంలోకి వెళ్తున్న విక్రమ్ రెడ్డిని అడ్డుకున్న వృద్ధురాలు "మా పంట పొలాలకు సాగునీరు అందక ఎండిపోయాయని" ఆవేదన వ్యక్తం చేసింది. వైసీపీ నేతలు కలగజేసుకుని వృద్ధురాలిని పక్కకు తీసుకెళ్లారు. ఎమ్మెల్యే ప్రసంగిస్తుండగా ప్రసంగాన్ని అడ్డుకున్నఓ మహిళ తాగునీరు సైడ్ కాలువలు లేవంటూ ఎమ్మెల్యే దృష్టికి తీసుకు వెళ్లే ప్రయత్నం చేయగా స్థానిక వైసీపీ నాయకులు అడ్డుకుని పక్కకు తీసుకెళ్లారు.