బెజవాడ దుర్గమ్మను దర్శించుకున్న కొణిదెల నిహారిక - Niharika visits Indrakeeladri - NIHARIKA VISITS INDRAKEELADRI
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/02-08-2024/640-480-22109554-thumbnail-16x9-actress-niharika-visits-indrakeeladri.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 2, 2024, 1:21 PM IST
Actress Niharika visits Indrakeeladri : నిర్మాత, నటి నిహారిక కొణిదెల విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గామల్లేశ్వరస్వామిని దర్శించుకున్నారు. దుర్గమ్మ దర్శనం అనంతరం ఈవో కేఎస్ రామారావు నిహారికకు అమ్మవారి చిత్రపటాన్ని, ప్రసాదాన్ని అందజేశారు. తాను నిర్మించిన కమిటీ కుర్రోళ్ళు చిత్రం విజయవంతం కావాలని దుర్గమ్మను వేడుకున్నానని నిహారిక తెలిపారు. చిత్రాన్ని ఆగస్టు 9న ప్రేక్షకులు వీక్షించాలని ఆమె కోరారు.
దాదాపు 16మంది కొత్త నటీనటులతో తెరకెక్కిన సరికొత్త చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’ సినిమాకు యదు వంశీ దర్శకత్వం వహించారు. నిహారిక కొణిదెల సమర్పణలో పద్మజ కొణిదెల, జయలక్ష్మి అడపాక నిర్మించారు. ఆగస్టు 9న ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది. యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా దీనిని తెరకెక్కించారు. సాయికుమార్, శ్రీలక్ష్మి కీలకపాత్రలు పోషించారు. అనుదీప్ దేవ్ స్వరాలు అందించారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, పాటలు యువతను ఆకట్టుకున్నాయి. నిహారిక ప్రస్తుతం ప్రమోషన్స్‌లో బిజీగా పాల్గొంటున్నారు. వంశీ చెప్పిన కథ తనకెంతో నచ్చిందని ఇది తప్పకుండా ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుందని ఆమె ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.