LIVE : మెదక్ జిల్లా అల్లాదుర్గం బహిరంగ సభలో ప్రధాని మోదీ - ప్రత్యక్ష ప్రసారం - Modi Campaign in Medak - MODI CAMPAIGN IN MEDAK
🎬 Watch Now: Feature Video
Published : Apr 30, 2024, 4:45 PM IST
|Updated : Apr 30, 2024, 5:52 PM IST
Prime Minister Modi Election Campaign in Medak Live : రాష్ట్రంలో బీజేపీ నేతలు ప్రచారంలో దూసుకుపోతున్నారు. జాతీయ నేతల దిశానిర్దేశంతో ప్రజల్లోకి క్షేత్రస్థాయిలో వెళ్తున్న అభ్యర్థులు, పార్టీ శ్రేణులు, గత బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాల్ని ఎండగడుతూ, ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన హామీల అమలు తీరుపై విమర్శలు గుప్పిస్తూ ఎన్నికల ప్రచారాన్ని చేస్తున్నారు. మరోవైపు పార్టీ అగ్రనేతలు రాష్ట్రానికి వరుస కడుతున్నారు. తమకు ఒక్క అవకాశం ఇవ్వాలని ఓటర్లను అభ్యర్థిస్తూ ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పిస్తున్నారు. పదేళ్ల పాటు బీజేపీ చేసిన అభివృద్ధి పనులను ప్రజలకు వివరిస్తున్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ కనుమరుగవుతుందని తెలిపారు. ఇందులో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ మెదక్ జిల్లాలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొన్నారు. జహీరాబాద్, మెదక్ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేస్తున్నారు. తాము అధికారంలోకి వస్తే చేసే అభివృద్ధిని ప్రజలకు వివరిస్తున్నారు. కేంద్రంలో తెలంగాణ నుంచి మంత్రలు ఉంటే జరిగే ప్రయోజనాల గురించి తెలియజేస్తున్నారు.
Last Updated : Apr 30, 2024, 5:52 PM IST