స్టాక్ మార్కెట్‌కు ఎందుకీ నష్టాలు? - కలవరపెడుతున్న ప్రస్తుత పరిస్థితులు - Prathidhwan Debate on Stock Market
🎬 Watch Now: Feature Video
Published : Jan 23, 2024, 9:29 PM IST
|Updated : Jan 23, 2024, 9:41 PM IST
Prathidhwani on Stock Market : మదుపర్లకు కొన్నిరోజులుగా కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి దేశీయ స్టాక్‌మార్కెట్‌లు. ఇటీవలే సూచీలు కొత్త జీవనకాల గరిష్ఠాలు నమోదు చేశాయన్న ఆనందాన్ని ఎంతోకాలం నిలవ నీయడం లేదు ఈ పరిణామాలు. మరి అంతా బావుంది అనుకున్నంతలోనే ఎందుకీ పతనం? కొద్ది రోజులుగా దేశీయ స్టాక్ మార్కెట్ భారీ నష్టాలను మూట గట్టుకుంటోంది. ఉన్నట్లుండి మార్కెట్ ఈ స్థాయి నష్టాలకు కారణాలేంటి? మరీ ముఖ్యంగా అంతర్జాతీయ ఆర్థిక విపణుల్లో ఏ ఏ అంశాలు భారతీయ మార్కెట్‌లను ఇంతగా కలవర పెడుతున్నాయి? ఎందుకు?.
Debate on Stock Market : మార్కెట్‌ను నిరంతరం ఎన్నో వార్తలు ప్రభావితం చేస్తుంటాయి. కొన్నింటికి పాజిటివ్, మరికొన్నింటికి ప్రతికూలంగానూ మార్కెట్ స్పందిస్తుంది. ఈ కదలికల్ని ఎలా గమనించాలి? ఇటీవలి కాలంలో మార్కెట్ లాభాలు చూసిన చాలామంది ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లతోపాటు, నేరుగా షేర్లలోనూ ఆసక్తి చూపిస్తున్నారు. అలాంటివాళ్ళు ఇప్పుడేం చేయాలి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.