హత్యకేసులో స్వాధీనం - నంబర్ ప్లేట్ తొలగించి వాడుకుంటున్న పోలీసులు - Police Use criminals Cars - POLICE USE CRIMINALS CARS

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 18, 2024, 5:01 PM IST

Police Using Criminals Cars for Their Own Work In Palnadu District: ఏవైనా నేరాలకు నిందితులు ఉపయోగించిన వాహనాల్ని పోలీసులు ఆధారాలుగా చూపేందుకు స్వాధీనం చేసుకోవాలి లేదా న్యాయస్థానం ఆదేశాలు వచ్చే వరకూ స్టేషన్​లో భద్రంగా ఉంచాలి. కానీ పల్నాడు జిల్లా రాజుపాలెం పోలీసులు మాత్రం ఓ హత్య కేసులో స్వాధీనం చేసుకున్న వాహనాన్ని సొంత అవసరాల కోసం వాడేస్తున్నారు. మొక్కపాడుకు చెందిన ఓ వ్యక్తిని అతని భార్య, ప్రియుడు, మరో వ్యక్తి కలసి కారులో గ్రామ పొలిమేరల్లోకి తీసుకెళ్లి హత్య చేసి మృతదేహాన్ని అదే కారులో విజయవాడ సమీపంలో కృష్ణా నదిలో పడవేశారు. 

ఈ కేసులో నిందితులను పోలీసులు అరెస్టు చేసి వారి నుంచి ఓ కారుని స్వాధీనం చేసుకున్నారు. ఇప్పుడు ఆ కారుని పోలీసులు స్టేషన్ అవసరాలతో పాటు వ్యక్తిగత పనులకు తీసుకెళ్తున్నారు. నంబరు ప్లేటు తొలగించి వినియోగిస్తున్నారు. విధులపై వెళ్తున్న సమయంలో కొందరు, వ్యక్తిగత పనుల కోసం మరికొందరు పోలీసులు ఈ కారుని వాడుకుంటున్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.