thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 27, 2024, 8:06 PM IST

ETV Bharat / Videos

HDFC రూ. 2.20 కోట్ల చోరీ కేసు - గంటల వ్యవధిలో ఛేదించిన పోలీసులు - Police Solved HDFC Theft Case

Police Solved Theft Case of HDFC in Rajamahendravaram: రాజమహేంద్రవరం హెచ్‌డీఎఫ్‌సీకి చెందిన 2 కోట్ల 20 లక్షల చోరీ కేసును పోలీసులు ఛేదించారు. నిందితుడు అశోక్‌ను పట్టుకుని డబ్బులు స్వాధీనం చేసుకున్నారు.  ఈ ఘటన వివరాలను ఎస్పీ నర్సింహ కిశోర్‌ మీడియాకు వెల్లడించారు. హెచ్‌డీఎఫ్‌సీ ఏటీఎంలలో డబ్బులు నింపే ఏజెన్సీ తరఫున పని చేస్తున్న అశోక్‌ పక్కా ప్రణాళికతో నగదు ఎత్తుకెళ్లినట్లు గుర్తించారు. బ్యాంకు సిబ్బంది, సెక్యూరిటీ కళ్లుగప్పి డబ్బులతో పరారైనట్లు చెప్పారు. ఫిర్యాదు అందగానే 5 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి కొన్ని గంటల వ్యవధిలో ఛేదించినట్లు ఎస్పీ నరసింహ కిశోర్ చెప్పారు. బ్యాంకు సిబ్బంది, సెక్యూరిటీ కళ్లు గప్పి అశోక్‌ పరారైనట్లు పోలీసులు తెలిపారు. చోరీకి పాల్పడిన నిందితుడు విలాసాలకు అలవాటు పడి చోరీకి ప్లాన్‌ చేశాడని వివరించారు. ఏటీఎంలకు ఎప్పుడు ఎక్కువ డబ్బులు వస్తాయో ముందుగానే గుర్తించి చోరీకి ముందుగానే నిర్ణయించుకున్నాడని తెలిపారు. సాంకేతిక ఆధారాలు, సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడిని పట్టుకున్నట్లు ఎస్పీ వివరించారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.