ETV Bharat / state

సాగునీటి సంఘాల ఎన్నికలకు వేళాయే! - IRRIGATION SOCIETIES ELECTION

సుదీర్ఘ కాలం తర్వాత సాగునీటి సంఘాల ఎన్నికల హడావుడి

IRRIGATION_SOCIETIES_ELECTION
IRRIGATION_SOCIETIES_ELECTION (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 29, 2024, 11:15 AM IST

Irrigation Societies Election in Joint Krishna District : సుదీర్ఘ కాలం తర్వాత ఉమ్మడి కృష్ణా జిల్లాలో సాగునీటి సంఘాల ఎన్నికల హడావుడి మొదలైంది. గత ఐదేళ్లలో వైఎస్సార్సీపీ సర్కార్‌ సాగునీటి సంఘాల ఎన్నికల ఊసే ఎత్తలేదు. కూటమి సర్కార్‌ ప్రస్తుతం నీటి వినియోగదారుల సంఘాలు, పంపిణీ కమిటీలు, ప్రాజెక్టు కమిటీల ఎన్నికలకు షెడ్యూల్‌ ప్రకటించడంతో సందడిగా మారింది. నీటి వినియోగదారుల సంఘాలు ఏర్పాటైతే సాగునీటి దుర్వినియోగాన్ని అరికట్టే వీలుంటుంది. మరో వైపు ప్రాజెక్టు కమిటీ ఛైర్మన్‌ ఎన్నికల తర్వాత రాష్ట్ర స్థాయి అపెక్స్‌ కమిటీకి ప్రాధాన్యం సంతరించుకోనుంది.

సాగునీటి సంఘాల ఎన్నికల హడావుడి : రైతులకు ఆయకట్టు పరిధిలో సాగునీటి ఇబ్బందులు తొలగించి చివరి భూములకు నీరందించేలా పర్యవేక్షణ చేసేందుకు కాలువల వారీగా సాగునీటి సంఘాలకు శ్రీకారం చుట్టారు. పంట కాలువల, మురుగు కాలువల మరమ్మతులు, రైతుల సమస్యలను నేరుగా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యలను పరిష్కరించాలనే లక్ష్యంతో 1999లో ఏర్పాటు చేసి ఎన్నికలు నిర్వహించారు. రాష్ట్ర విభజన తర్వాత 2015 లో ఆ సంఘాలను టీడీపీ సర్కార్‌ పునరుద్ధరించింది. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2019 సెప్టెంబర్‌లో కృష్ణా జిల్లాలోని 172 సాగునీటి వినియోగదారుల సంఘాలు, 32 డిస్ట్రిబ్యూటరీ కమిటీలు, ప్రాజెక్టు కమిటీని రద్దు చేసింది. దీంతో ఆ బాధ్యతలను జలవనరుల శాఖ అధికారులే నిర్వహించాల్సి వచ్చింది. సాగునీటి సంఘాలను విస్మరించి పంట కాలువలను వైఎస్సార్సీపీ సర్కార్‌ నాశనం చేసింది.

'కూటమి ప్రభుత్వం వచ్చింది - సాగు నీళ్లు తెచ్చింది' - హంద్రీనీవా రైతుల ఆనందోత్సాహాలు

తూర్పు డెల్టా ప్రాజెక్టు కమిటీ ఎన్నిక : ఉమ్మడి కృష్ణా జిల్లాలో మూడు ప్రాజెక్టు కమిటీలు ఏర్పాటు కావాలి. ప్రధానంగా నీటి పంపిణీ, కాలువల నిర్వహణ, మరమ్మతులు తదితర బాధ్యతలు నీటి వినియోగదారుల సంఘాలకు అప్పగించే వీలుంటుంది. జిల్లాలో తూర్పు డెల్టా ప్రాజెక్టు కమిటీ ఎన్నిక ప్రతిష్టాత్మకంగా మారనుంది. దీని కింద ఏలూరు కాలువ, బందరు కాలువ, రైవస్‌ కాలువలు ఉన్నాయి. కృష్ణా, ఏలూరు జిల్లాలో ఆయకట్టు, ఎన్టీఆర్​ జిల్లాలో విజయవాడ గ్రామీణం ఉంది. జలవనరుల శాఖ అధికారులు ముందుగా ఆయకట్టుదారుల జాబితా తయారు చేసి వచ్చే నెల 13న (నవంబర్​ 13న) ప్రకటిస్తారు. అభ్యంతరాలు స్వీకరించి ఆర్డీవో ఆధ్వర్యంలో పరిష్కరిస్తారు. ప్రతి పంపిణీ కమిటీ కింద 5 నుంచి 12 నీటి వినియోగదారుల సంఘాలు ఉంటాయి. సంఘాలకు అధ్యక్ష, ఉపాధ్యక్షులతో ఒక కమిటీ ఏర్పాటవుతుంది. దీనికి రాజకీయంగానూ ప్రాధాన్యం ఉంది. వచ్చే నెల 24న పంపిణీ కమిటీలను, 27న ప్రాజెక్టు కమిటీలను ఎన్నుకుంటారు.

నిలిచిన ఉల్లి విక్రయాలు- మార్కెట్ ఎదుట అన్నదాతల జాగారం

నీటి వినియోగదారుల సంఘాల ఏర్పాటు : అపెక్స్‌ కమిటీలో కృష్ణా జిల్లా తూర్పు డెల్టా నుంచి తప్పక ప్రాధాన్యం ఉంటుంది. రాష్ట్రంలో ఇది కీలకంగా మారనుంది. ఈ సారి ఎలాంటి ప్రాధాన్యం దక్కుతుందనే దానిపై చర్చ సాగుతోంది. ఉమ్మడి జిల్లాలో మూడో ప్రాజెక్టు కమిటీని మధ్య తరహా, చిన్న నీటి పారుదలకు కేటాయించారు. మున్నేరు, తమ్మిలేరుకు కలిపి ఈ ప్రాజెక్టు కమిటీ ఉంది. దీని పరిధిలో రెండు మాత్రమే డీసీ కమిటీలు ఉన్నాయి. చిన్న నీటి పారుదలకు ప్రతి 100 ఎకరాలు ఉన్న ఆయకట్టు చెరువు కింద నీటి వినియోగదారుల సంఘం ఏర్పాటు చేయాలి. వీటికి పంపిణీ కమిటీలు లేవు. నేరుగా ప్రాజెక్టు కమిటీ పరిధిలో ఉంటారు. వత్సవాయి, నందిగామ, పెనుగంచిప్రోలు మండలాలతో పాటు తమ్మిలేరు కింద చాట్రాయి మండలాలను దీని పరిధిలో చేర్చారు. చిన్న నీటి పారుదల కింద దాదాపు 212 నీటి వినియోగదారుల సంఘాల ఏర్పాటు కానున్నాయి.

"ప్రకృతి సాగు పుడమికి శ్రీరామరక్ష" - మాస్టర్‌ ట్రైనర్‌ ద్వారా శిక్షణ ఇప్పిస్తున్న ప్రభుత్వం

సుదీర్ఘ కాలం తర్వాత : ఎన్​ఎస్​పీ ఆయకట్టుకు ఒక ప్రాజెక్టు కమిటీ జిల్లాకు కేటాయించారు. జోన్‌ 2, జోన్‌ 3 పరిధిలో నూజివీడు, తిరువూరు, మైలవరం, జగ్గయ్యపేట, నందిగామ ఉన్నాయి. ఈ జోన్ 2, జోన్ 3లకు సరిగా నీరు రావడం లేదు. జగ్గయ్యపేట, నూజివీడు సబ్ జోన్లకు పూర్తిగా నీరందని పరిస్థితి నెలకొంది. దీనికి ప్రాజెక్టు కమిటీని ఎన్నుకోనున్నారు. 106 సాగునీటి వినియోగదారుల సంఘాలు, 17 డీసీలు ఉన్నాయి. శివారుకు నీరందేలా మరింత చొరవ చూపే వీలుంది. గత కొన్నేళ్లుగా ప్రభుత్వాలు ఈ సంఘాలకు అవసరమైన మొత్తంలో నిధులు విడుదల చేయడం లేదు. భూమి శిస్తు ద్వారా సమకూరిన నిధుల ద్వారా మాత్రమే వీటి నిర్వహణ చేపట్టాలని చెబుతున్నారు. కూటమి ప్రభుత్వం నీటి సంఘాలను ప్రజాస్వామికంగా పునరుద్దరిచడంతో పాటు శిస్తు వసూలుతో ముడి పెట్టకుండా కనీస నిర్వహణకు సకాలంలో నిధులు విడుదల చేయాల్సి ఉంది.

పామాయిల్​ తోటలో 12 అడుగుల కింగ్​ కోబ్రా - రైతన్నల ఆందోళన

సాగునీటి సంఘాల పునర్నిర్మాణం : బందరు కాలువ పరిధిలో లక్షా 51 వేల ఎకరాలు, కృష్ణా ఈస్ట్రన్ బ్యాంకు కెనాల్ కింద లక్షా 38 వేల ఎకరాలు, ఏలూరు కాలువ కింద 64 వేల ఎకరాలు, రైవస్ కాల్వ కింద 2 లక్షల 17 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. ఈ ఆయకట్టుకు ఖరీఫ్‌లో 141.72 టీఎంసీలు, వేసవిలో తాగునీరు, రబీ పంటల సాగుకు మరో 28.56 టీఎంసీ నీరు విడుదల చేయాల్సి ఉంటుంది. నిర్వహణ అస్తవ్యస్తవంగా ఉండటంతో 170. 26 టీఎంసీల నీరు విడుదల చేసినా చివరి భూములకు నీరందని పరిస్థితి నెలకొంది. మరోపక్క డెల్టాలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. కొద్దిపాటి వర్షాలకే పంట పొలాలు ముంపునకు గురై రైతులు నష్టపోతున్నారు. వైఎస్సార్సీపీ నిర్లక్ష్యం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని సాగునీటి సంఘాల ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం సాగునీటి సంఘాలను పునర్నిర్మాణం చేయడం సంతోషంగా ఉందంటున్నారు.

రైతుల ఆకలి తీర్చే క్యాంటీన్లు - హోటళ్లకు దీటుగా 15 రూపాయలకే భోజనం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.