ETV Bharat / entertainment

'అది నిరూపిస్తే, సినిమాలు మానేస్తా'- కిరణ్ అబ్బవరం ఛాలెంజ్​!

'క' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు కిరణ్- ఈ నేపథ్యంలో ప్రెస్​మీట్​లో పాల్గొన్నారు-

Kiran Abbavaram KA Movie
Kiran Abbavaram KA Movie (Source: ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : 2 hours ago

Kiran Abbavaram KA Movie : టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం 'క' (KA) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమాకు డైరెక్టర్లు సుజీత్, సందీప్ దర్శకత్వం వహించారు. దీపావళి సందర్భంగా అక్టోబర్ 31న ఈ సినిమా గ్రాండ్​గా థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్​ శుక్రవారం ట్రైలర్ రిలీజ్ చేయగా, తాజాగా హైదరాబాద్​లో ప్రెస్​మీట్ నిర్వహించారు.

ఈ ప్రెస్​మీట్​కు హీరో కిరణ్ అబ్బవరం సహా మూవీటీమ్ హాజరైంది. సినిమాలో ఆయన పోషించిన పోస్ట్​మెన్ క్యారెక్టర్ గెటప్​లోనే వచ్చారు. ఇక సినిమా గురించి కిరణ్​ పలు ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకున్నారు. సినిమాపై ఈయన చాలా కాన్ఫిడెంట్​గా ఉన్నారు. ఇది ఒక విభిన్నమైన కాన్సెప్ట్​తో తెరకెక్కిన చిత్రమని ఆయన అన్నారు. ఇలాంటి కాన్సెప్ట్​తో ఇప్పటివరకూ సినిమా రాలేదని, ఒకవేళ వచ్చినట్టు నిరూపిస్తే ఆయన సినిమాలు చేయడం మానేస్తానని అన్నారు.

కాగా, ఈ సినిమాలో న‌య‌న్ సారిక‌, త‌న్వి రామ్ హీరోయిన్లుగా నటించారు. శ్రీ చక్రాస్ ఎంటర్టైన్మెంట్​ బ్యానర్‌పై చింతా గోపాలకృష్ణ రెడ్డి ఈ సినిమాను నిర్మించారు. ఇప్పటికే రిలీజైన ఈ ట్రైలర్​కు ఊహించని రేంజ్​లో స్పందన లభిస్తోంది. ఆద్యంతం ఉత్కంఠగా సాగిన ట్రైలర్ సినిమాపై అమాంతం అంచనాలు పెంచేస్తోంది. 24 గంటల్లోనే ఈ ట్రైలర్​కు 40 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.