అబిడ్స్‌లో బాలిక కిడ్నాప్ - 24 గంటల్లో రెస్క్యూ చేసిన పోలీసులు - ABIDS POLICE RESCUED KIDNAPPED GIRL - ABIDS POLICE RESCUED KIDNAPPED GIRL
🎬 Watch Now: Feature Video
Published : Aug 4, 2024, 10:54 AM IST
|Updated : Aug 4, 2024, 12:31 PM IST
Girl Kidnap Case Hyderabad : హైదరాబాద్ అబిడ్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కట్టెల మండిలో కిడ్నాప్‌నకు గురైన బాలిక ఆచూకీని పోలీసులు కనుగొన్నారు. కొత్తూరు మండలం ఇనుములనర్వ వద్ద బాలికను గుర్తించారు. కిడ్నాప్ చేసిన వ్యక్తిని అరెస్టు చేసి, బాలికను అబిడ్స్‌కు తరలించారు. సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా పోలీసులు ఆమెను కనిపెట్టారు.
అసలేం జరిగిందంటే..? బేగంబజార్ ఛత్రికి చెందిన ఓ బాలిక, మరో బాలుడితో కలిసి ఈనెల 3వ తేదీన శనివారం సాయంత్రం ముత్యాలమ్మ దేవాలయం వద్దకు ఆడుకోవడానికి వెళ్లింది. కొద్దిసేపటికి ఆ బాలుడు ఇంటికి వచ్చినా బాలిక రాకపోవడంతో, ఆమె కుటుంబ సభ్యులు చుట్టుపక్కల వెతికారు. ఎంత వెతికినా ప్రయోజనం లేకపోవడంతో, అబిడ్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు, ఐదు బృందాలుగా విడిపోయి సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు కొనసాగించారు. ఈ క్రమంలో బాలికను ఆటోలో వచ్చిన కొంతమంది కిడ్నాప్ చేసిన విషయాన్ని గుర్తించారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా బాలిక ఉన్న ప్రాంతాన్ని గుర్తించారు. ఈ క్రమంలో ఆ చిన్నారి కొత్తూరు మండలంలో ఇనుముల రవ్వ వద్ద ఉండగా అక్కడికి వెళ్లిన అధికారులు ఇవాళ ఉదయం హైదరాబాద్‌కు తీసుకువచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు. అలాగే బాలికను కిడ్నాప్ చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. కిడ్నాపర్ బిహార్‌కు చెందిన బిలాల్‌గా గుర్తించారు.