ఎన్నికల వేళ స్వగ్రామాలకు ఓటర్లు- వారికి భద్రతగా పోలీసులు - Police Picketing in Pinnelli
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 1, 2024, 10:26 PM IST
Police Picketing in Pinnelli: వైఎస్సార్సీపీ (YSRCP) అరాచకాలతో ఊరు వదిలి వెళ్లిపోయిన కుటుంబాలు తిరిగి తమ స్వగ్రామాలకు చేరుకున్నాయి. పల్నాడు జిల్లా మాచవరం మండలం పిన్నెల్లిలో దాదాపు నాలుగేళ్ల క్రితం తెలుగుదేశం వర్గీయులు ఊరు వదిలి వెళ్లిపోయారు. సుమారు 60 మంది ముస్లిం, బీసీ కుటుంబాలు గామాలపాడు, దాచేపల్లి, గురజాలతో పాటు ఇతర ప్రాంతాలకు తరలిపోయారు.
TDP Sympathizers Reached Their Home Due To Elections: ప్రస్తుతం ఎన్నికల కోడ్ రావడంతో, ఆ కుటుంబాలన్నీ గురజాల టీడీపీ మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు సహయంతో ఆదివారం స్వగ్రామానికి తిరిగి చేరుకున్నారు. ఆ కుటుంబాలను గ్రామస్థులు ఆత్మీయంగా పలకరించి స్వాగతం పలికారు. గ్రామంలో ఎలాంటి అల్లర్లు, గొడవలు జరగకుండా స్థానిక పోలీసులు, కేంద్ర భద్రతా బలగాలు పికెట్ (Picketing) నిర్వహిస్తున్నాయి.
మరోవైపు ఓటు హక్కు వినియోగంపై ఎన్నికల సంఘం విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తోంది. కళాశాలల్లో ఓటుహక్కు వినియోగంపై ప్రజలను చైతన్యం చేయటం కోసం పలు సదస్సులు ఇప్పటికే నిర్వహించారు. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో ఓటర్లను చైతన్యం చేయడానికి అధికారులు విద్యార్థుల ద్వారా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.