కౌంటింగ్‌ రోజు ఎలాంటి ఘర్షణలు జరగకుండా - టెక్కలిలో పోలీసులు మాక్‌డ్రిల్‌ నిర్వహణ - Police Mock Drills in Tekkali - POLICE MOCK DRILLS IN TEKKALI

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 1, 2024, 11:27 AM IST

Police Mock Drills for Tight Security in Tekkali  : సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సమయం దగ్గరపడుతుండటంతో అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. పోలింగ్ అనంతరం రాష్ట్రంలో పెద్ద ఎత్తున హింస చెలరేగడంతో పోలీసులు మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కేంద్ర బలగాలను రంగంలోకి దించిన పోలీసు శాఖ వివిధ చోట్ల కవాత్ నిర్వహించింది. పలు చోట్ల పోలీసుల మాక్ డ్రిల్ నిర్వహించారు. గొడవలకు దిగితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.

June 4th Votes Counting in Andhra Pradesh : శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో శుక్రవారం భద్రత బలగాలు నిర్వహించిన మాక్ డ్రిల్ అందర్నీ ఆకట్టుకుంది. కౌంటింగ్ వేళ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు మాక్ డ్రిల్ నిర్వహించారు. ఒకవేళ ఏదైనా అవాంఛనీయ ఘటన చోటుచేసుకుంటే ఎలా నియంత్రించాలో ప్రయోగాత్మకంగా చేసి చూపారు. ఇందిరా కూడలిలో ఓ వైపు పోలీసులకు వ్యతిరేకంగా ఆందోళనకారుల నినాదాలు మరోవైపు వారిని అదుపు చేసేందుకు ఫైర్ ఇంజిన్ తో నీటిని కుమ్మరించడం, బాష్పవాయువు ప్రయోగం, కాల్పులు, లాఠీ ఛార్జ్ చేయడంతో పాటు గాయపడ్డ వారికి వైద్యం అందించే దృశ్యాలు యుద్ధ వాతావరణాన్ని తలపించి నిజమేనన్న భ్రమను కలిగించాయి. ప్రజలకు అవగాహన కల్పించేందుకు పోలీసుల నిర్వహిస్తున్న మాక్ డ్రిల్ అని తెలుసుకుని అందరూ ఊపిరి తీసుకున్నారు. డీఎస్పీ బాలచంద్రారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన మాక్ డ్రిల్ లో పెద్ద సంఖ్యలో పోలీసు బలగాలు పాల్గొన్నాయి.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.