ఇసుక ట్రాక్టర్ ఢీకొని హెడ్ కానిస్టేబుల్​కు తీవ్ర గాయాలు - సీసీటీవీలో రికార్డయిన దృశ్యాలు - Police Head Constable Accident - POLICE HEAD CONSTABLE ACCIDENT

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Aug 15, 2024, 5:26 PM IST

Police Head Constable Accident In Warangal : వరంగల్ జిల్లాలో ఇసుక ట్రాక్టర్ ఢీకొని హెడ్ కానిస్టేబుల్ తీవ్ర గాయాల పాలయ్యాడు. వరంగల్ వైపు ఇసుక లోడుతో వేగంగా వెళ్తున్న ఓ ట్రాక్టర్ విధులకు హాజరయ్యేందుకు ద్విచక్ర వాహనంపై వస్తున్న హెడ్ కానిస్టేబుల్ బాలాజీని ఢీ కొట్టింది. ఈ ప్రమాద సమయంలో హెల్మెట్ కింద పడిపోవడంతో ఆయన మెడకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అక్కడి స్థానికులు గమనించి ఆస్పత్రికి తరలించారు. కానిస్టేబుల్​కు తీవ్ర గాయాలు కాగా హైదరాబాద్​లోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. 

ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. మామునూరు నాలుగవ బెటాలియన్​లో బాలాజీ హెడ్ కానిస్టేబుల్​గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ద్విచక్ర వాహనంపై విధులకు హాజరయ్యే సమయంలో రోడ్డు మూలమలుపు వద్ద ఈ ప్రమాదం జరిగింది. రోడ్డుపై ఇసుక ట్రాక్టర్ ఢీకొన్న సన్నివేశాలు అక్కడి సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.