ఏజెన్సీ గ్రామాల్లో స్పెషల్ పార్టీ పోలీసుల కూంబింగ్ - భయాందోళనకు గురవుతున్న స్థానికులు - Police Combing in Telangana
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/17-02-2024/640-480-20772438-thumbnail-16x9-police.jpg)
![ETV Bharat Telangana Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/telangana-1716536068.jpeg)
Published : Feb 17, 2024, 12:03 PM IST
Police Combing in Mahabubnagar Agency Areas : ప్రశాంతంగా ఉన్న ఏజెన్సీ గ్రామాల్లో ఒక్కసారిగా అలజడి నెలకొంది. పోలీసుల కూంబింగ్‌తో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం ఏజెన్సీ గ్రామాలైన లక్ష్మీపురం, మిర్యాలపెంట, సాంబ తండా, ఇసుక మేరీ, చింతల తండా తదితర గ్రామాలు, అటవీ ప్రాంతం, పంట చేలల్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన వందలాది మంది స్పెషల్ పార్టీ పోలీసులు జల్లెడ పడుతున్నారు. గ్రామాల్లో ఇంటింటి సోదాలు నిర్వహిస్తున్నారు.
Police Combing Operation in Telangana : సీపీఐ(ఎంఎల్) న్యూ డెమోక్రసీ అజ్ఞాత దళాలు సంచరిస్తున్నాయనే విశ్వసనీయ సమాచారంతో పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు పోలీసులు అదుపులోకి తీసుకున్న న్యూ డెమోక్రసీ అజ్ఞాత దళ కమాండర్లు, సభ్యులను విడుదల చేయాలంటూ న్యూ డెమోక్రసీ శ్రేణులు పలుచోట్ల నిరసన వ్యక్తం చేయగా, పోలీసులు అరెస్టు చేసినట్లు వెల్లడించారు. రాష్ట్ర కార్యదర్శి అశోక్ అలియాస్ వజ్జయ్య, వరంగల్ జిల్లా కార్యదర్శి గోపన్న అలియాస్ దనసరి, వీరితో పాటు మరి కొంతమందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.