రూ.35 లక్షల విలువ గల నకిలీ పత్తి విత్తనాలు పట్టివేత - ఇద్దరు అరెస్టు - police seized fake seeds Mahmadpur

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Feb 24, 2024, 2:57 PM IST

Police Arrest Two Men for Selling Fake Seeds : సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం మహ్మదాపూర్ గ్రామంలో సిద్దిపేట టాస్క్ ఫోర్స్, హుస్నాబాద్ పోలీసులు సంయుక్తంగా దాడులు జరిపి సుమారు 35 లక్షల రూపాయల విలువ గల 1,450 కిలోల నకిలీ పత్తి విత్తనాలను పట్టుకున్నారు. మహ్మదాపూర్ గ్రామంలోని ఓ ఇంట్లో నకిలీ పత్తి విత్తనాలు నిల్వ ఉంచారనే పక్కా సమాచారంతో పోలీసులు తనిఖీ చేయగా నకిలీ దందా బయట పడింది. 

Men Selling Fake Seeds in Siddipet : ఇంట్లో ఎలాంటి ప్రభుత్వ అనుమతి, కంపెనీ ప్యాకింగ్ లేని 50 కేజీలు ఉన్న 29 సంచులను పరిశీలించగా అందులో నకిలీ పత్తి విత్తనాలు ఉన్నట్లు గుర్తించామని హుస్నాబాద్ ఎస్సై మహేష్ తెలిపారు. గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు ఈ నకిలీ విత్తనాలను హుస్నాబాద్, కోహెడ, అక్కన్నపేట మండలాల్లోని గ్రామాల రైతులకు, ఇతర జిల్లాల్లో అమ్మడానికి నిలువ చేసి ఉంచినట్లు పేర్కొన్నారు. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.