LIVE : జగిత్యాల బీజేపీ విజయ సంకల్ప సభలో ప్రధాని మోదీ ప్రసంగం - Modi Attends Jagtial Public Meeting
🎬 Watch Now: Feature Video
Published : Mar 18, 2024, 11:04 AM IST
|Updated : Mar 18, 2024, 12:15 PM IST
PM Modi Jagtial Public Meeting Live : లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీ జగిత్యాల జిల్లాలో పర్యటిస్తున్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన బీజేపీ విజయ సంకల్ప సభకు ఆయన హాజరయ్యారు. సార్వత్రిక ఎన్నికల షెడ్యూలు వెలువడిన తర్వాత రాష్ట్రంలో తొలిసారి నిర్వహిస్తున్న జగిత్యాల సభ ద్వారా కరీంనగర్, నిజామాబాద్, పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి ఎన్నికల శంఖాన్ని ప్రధాని పూరిస్తున్నారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పార్టీ రాష్ట్రంలో 4 స్థానాల్లో గెలుపొందగా అందులో 3 ఉత్తర తెలంగాణలోని కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ నియోజకవర్గాలే కావడం విశేషం. ఈ ప్రాంతంలో మరింత పట్టు బిగించేందుకు ఈ ఎన్నికల్లో ప్రధాని మోదీ సభలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ నుంచి హెలిక్టాప్టర్లో కాసేపటి క్రితం జగిత్యాల చేరుకున్న మోదీ అక్కడ జరిగే బహిరంగ సభలో పాల్గొన్నారు. ఉత్తర తెలంగాణలో తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో ప్రధాని మోదీ పర్యటన రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. అందుకు అనుగుణంగానే బీజేపీ ప్రచార ప్రణాళిక సిద్దం చేసింది. ఇప్పటికే ప్రధాని రెండు విడతలుగా రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. సభ అనంతరం మోదీ హైదరాబాద్‌కు, అక్కడి నుంచి దిల్లీకి వెళ్లనున్నారు.
Last Updated : Mar 18, 2024, 12:15 PM IST