LIVE : నారాయణపేట బహిరంగ సభలో ప్రధాని మోదీ - ప్రత్యక్షప్రసారం - PM Modi Election Campaign Live - PM MODI ELECTION CAMPAIGN LIVE

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : May 10, 2024, 3:46 PM IST

Updated : May 10, 2024, 4:19 PM IST

PM Modi Live : ఈసారి లోక్​సభ ఎన్నికల్లో ఎలాగైనా తెలంగాణలో రెండంకెల స్థానాలు గెలవాలని బీజేపీ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో భారీ బహిరంగ సభలు, రోడ్​ షోలు నిర్వహిస్తూ బీజేపీ శ్రేణుల్లో నూతనోత్తేజాన్ని తీసుకువస్తున్నారు. అలాగే బీజేపీ కేంద్ర అధినాయకత్వం కూడా తెలంగాణపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించింది. ఎన్నికల ప్రచారం జరుగుతున్న దగ్గర నుంచి ప్రధాని మోదీ, అమిత్​ షా, రాజ్​నాథ్​ సింగ్​ వంటి ప్రముఖులు తెలంగాణలో పర్యటించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు, అభివృద్ధిని జనాల్లోకి తీసుకెళ్లేందుకు యత్నిస్తున్నారు. ఈ సారి ఎలాగైనా రెండంకెల సీట్లకు తగ్గకుండా మెజార్టీ ఇవ్వాలని తెలంగాణ ప్రజలను కోరుతున్నారు. అందులో భాగంగా నేడు రాష్ట్రానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వచ్చారు. మహబూబ్​నగర్​ బీజేపీ లోక్​సభ అభ్యర్థి డీకే అరుణకు మద్దతుగా నారాయణపేటలో జరుగుతున్న బీజేపీ బహిరంగ సభకు విచ్చేశారు. భారీ జనసమీకరణ చేసిన బీజేపీ అధిష్ఠానం, మళ్లీ దేశంలో మోదీ రావాలని కోరుతున్నారు.
Last Updated : May 10, 2024, 4:19 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.