ఏళ్ల తరబడి మారని తీరు - రహదారులు లేక గిరిపుత్రుల అవస్థలు - People Suffering With Floods

🎬 Watch Now: Feature Video

thumbnail

People Suffering With Floods in Alluri District : ఓ వైపు అపారమైన అభివృద్ధి, మరో వైపు కనీస వసతులు లేక సతమతమవుతున్న సాధారణ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ హైటెక్​ యుగంలో కూడా రోడ్లు లేక ఇల్లు చేరడానికి గిరిపుత్రులు ప్రాణాలకు తెగించి వాగు దాటాల్సిన దుస్థితి నెలకొంది. ప్రభుత్వాలు మారుతున్నా వారి జీవితాల్లో మాత్రం వెలుగులు రావడం లేదు. మాకు కనీసం రోడ్డు సౌకర్యమేనా కల్పించామని కోరుకుంటున్నా వారి అవస్థలను పట్టించుకునే నాథుడే లేరు.

అల్లూరి జిల్లా అరకులోయ, అనంతగిరి, డుంబ్రిగూడ మండలాల్లోని గ్రామాల్లో వరద నీటితో రోడ్లు జలమయమయ్యాయి. భారీ వర్షం కురిస్తే ఆయా గిరిజన గ్రామాలకు బాహ్య ప్రపంచానికి మధ్య సంబంధాలు తెగిపోతాయి. గ్రామాల్లో రహదారులు లేక అవస్థలు పడుతున్నామని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. నిత్యావసరాలు, అత్యవసర వైద్య సేవలు కావాలంటే ప్రాణాలు అర చేతుల్లో పెట్టుకుని వాగు దాటాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం తమ సమస్యలు గుర్తించి వంతెనలు నిర్మించాలని ప్రజలు వేడుకుంటున్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.