నీట్ పేపర్ లీకేజీ బాధ్యులపై చర్యలు తీసుకోవాలి : వైఎస్ షర్మిల - YS Sharmila Fires on Central Govt - YS SHARMILA FIRES ON CENTRAL GOVT
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 21, 2024, 7:51 PM IST
YS Sharmila Fires on Central Govt : డాక్టర్లు అవుదామని ఆశపడ్డ 24 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో కేంద్రం చెలగాటం ఆడుతోందని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మండిపడ్డారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రతిష్టను దిగజార్చేలా నీట్ పేపర్ లీక్ స్కాం జరిగిందనే ఆధారాలు బయటపడ్డాయని అన్నారు. నీట్ విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ, విజయవాడలో అఖిలభారత కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు లెనిన్ కూడలిలో ఆమె నిరసన కార్యక్రమం చేపట్టారు.
YS Sharmila on NEET Paper Leak : పరీక్షకు ఆలస్యంగా వస్తే గ్రేస్ మార్కులు ఎలా ఇస్తారని వైఎస్ షర్మిల ప్రశ్నించారు. వారికి రెండు నిమిషాలు అదనపు సమయం ఇవ్వొచ్చని అన్నారు. అవకతవకలు జరిగినా ఇంతవరకు ఎన్టీఏ మీద చర్యలు తీసుకోలేదని విమర్శించారు. బీజేపీ ప్రభుత్వాలు అధికారంలో ఉన్న బిహార్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో పేపర్ లీక్ అయిందని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, జగన్ పేపర్ లీకేజీపై ఎందుకు స్పందించలేదని? పేర్కొన్నారు. దీనికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు.