thumbnail

జగన్ పాలనలో అప్పులు ఫుల్, అభివృద్ధి నిల్ - సంక్షోభంలో సంక్షేమం: తులసిరెడ్డి

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 13, 2024, 5:25 PM IST

PCC Media Chairman Tualsi Reddy Fire on CM Jagan: రామాయణాన్ని కట్టె, కొట్టె, తెచ్చే అని మూడు ముక్కల్లో చెప్పినట్లుగా జగన్​ పాలనను అప్పులు ఫుల్, అభివృద్ధి నిల్, సంక్షోభంలో సంక్షేమం అని చెప్పొచ్చని ఏపీసీసీ మీడియా ఛైర్మన్ తులసి రెడ్డి పేర్కొన్నారు. వైఎస్సార్ కడప జిల్లాలోని వేంపల్లిలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన ఈ మేరకు సీఎం జగన్​పై విమర్శనాస్త్రాలు సంధించారు. 2014-19 వరకు ఐదేళ్ల పాలనలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు (Former CM Chandrababu) ప్రభుత్వం చేసిన అదనపు అప్పు రూ.లక్షన్నర కోట్లు కాగా, జగన్​ సీఎం అయిన 4 ఏళ్ల 9 నెలల్లో రూ. 8 లక్షల కోట్లు అప్పులు (AP Debts in YSRCP Govt) చేశారని తెలిపారు. 

జగన్​ పాలనలో సంక్షేమం మేడిపండు చందంగా తయారైందన్న ఆయన సాగునీటి ప్రాజెక్టులు (Irrigation projects) నిధులు లేక నిలిచిపోయాయని మండిపడ్డారు. ఇక రహదారుల పరిస్థితి (Roads Condition in AP) చూస్తే ప్రయాణికులు భూలోకంలో యమలోకం చూస్తున్నారని విమర్శించారు. అమ్మఒడి (Amma Vodi Scheme) విషయానికి వస్తే ఆ నగదు నాన్న బుడ్డీ (Wines Rates in AP)కి చాలడం లేదని ఎద్దేవా చేశారు. మట్టి ముంత ఇచ్చి వెండి చెంబు దొంగలించినట్లుగా జగన్ రెడ్డి పాలన ఉందని ధ్వజమెత్తారు.  

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.