LIVE : జనసేన ఆవిర్భావ సభలో పవన్ కల్యాణ్ ప్రసంగం - Pawan Kalyan Latest Speech
🎬 Watch Now: Feature Video
Published : Mar 14, 2024, 2:06 PM IST
|Updated : Mar 14, 2024, 3:15 PM IST
Jana Sena Foundation Day Live : ఏపీలో జనసేన ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రసంగిస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించడమే జనసేన పార్టీ లక్ష్యమని స్పష్టం చేశారు. అధికార అహంకారంతో ప్రభుత్వం కొట్టుమిట్టాడుతోందని ఆయన ధ్వజమెత్తారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఈ సభలో పవన్ జనసైనికులకు దిశానిర్దేశం చేస్తున్నారు. వచ్చే ఎన్నికలకు ఎలా సిద్ధమవ్వాలో మార్గనిర్దేశం చేస్తున్నారు.పార్టీ సీనియర్ నేత నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ జగన్ అహంకారం, సామాన్యుల ఆత్మగౌరవానికి పోరాటమే జనసేన ఆవిర్భావ సభ అన్నారు. ప్రతిపక్షంగా ప్రజాసమస్యలపై పోరాడాల్సిన బాధ్యత తమకుందని చెప్పారు. సభకు ఆటంకం కలిగించవద్దని అధికారులను కోరారు. రాష్ట్రానికి మేలు జరగాలని కోరుకునే వ్యక్తి పవన్ అని తెలిపారు. జగన్ అహంకారం, సామాన్యుల ఆత్మగౌరవానికి పోరాటమే ఈ సభ అన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించడమే జనసేన పార్టీ లక్ష్యమని ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు.
Last Updated : Mar 14, 2024, 3:15 PM IST