LIVE: వారాహి బహిరంగ సభలో పాల్గొన్న పవన్ కల్యాణ్ - ప్రత్యక్ష ప్రసారం - Pawan Kalyan Varahi public meeting - PAWAN KALYAN VARAHI PUBLIC MEETING
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 3, 2024, 6:07 PM IST
|Updated : Oct 3, 2024, 7:24 PM IST
Pawan Kalyan Varahi Public Meeting: ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తిరుపతిలోని వారాహి బహిరంగ సభలో పాల్గొన్నారు. తిరుపతి బాలాజీ కాలనీలోని జ్యోతిరావు పూలే కూడలిలో బహిరంగ సభను ఏర్పాటు చేశారు. బహిరంగ సభలో వారాహి డిక్లరేషన్ అంశాలను పవన్ కల్యాణ్ వివరించనున్నారు. తీవ్ర జ్వరంతో బాధపడుతున్నా పవన్ కల్యాణ్ ఈ సభకు హాజరయ్యారు. శ్రీవారి లడ్డూ విషయంలో అపచారం జరిగిందంటూ శ్రీవారికి ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన పవన్ మంగళవారం నాడు మెట్లమార్గం గుండా తిరుమల చేరుకున్న విషయం తెలిసిందే. ఆ సమయంలో వెన్నునొప్పితో బాధపడ్డారు. ఈ క్రమంలోనే బుధవారం నాడు స్వామివారిని పవన్ కల్యాణ్ తన కుమార్తెలతో కలిసి దర్శించుకున్నారు. దర్శనం అనంతరం నేరుగా రంగనాయకుల మండపానికి పవన్ కల్యాణ్ వెళ్లారు. అక్కడ వేద పండితులు ఉప ముఖ్యమంత్రికి వేద ఆశీర్వచనం అందించారు. అనంతరం తిరుమలలో బస చేశారు. ఈ నేపథ్యంలోనే పవన్ ఆనారోగ్యంతో ఇబ్బంది పడుతుండటంతో తిరుమలలోని అతిథి గృహంలో వైద్యులు చికిత్స అందించారు. ప్రస్తుతం వారాహి బహిరంగ సభలో డిక్లరేషన్ అంశాలను పవన్ వివరించనున్నారు. ప్రత్యక్ష ప్రసారం.
Last Updated : Oct 3, 2024, 7:24 PM IST