Dastagiri Attend Police Interrogation on Viveka Case: వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అప్రూవర్ దస్తగిరిని పోలీసులు విచారించేందుకు కడపకు పిలిపించారు. ఈ మేరకు దస్తగిరి తొలుత రిమ్స్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి అక్కడ నుంచి విచారణ నిమిత్తం డీటీసీకి బయలుదేరి వెళ్లారు. అతని వెంట భార్య షబానా కూడా ఉన్నారు. దస్తగిరి కేంద్ర కారాగారంలో ఉన్నప్పుడు అతనిని డాక్టర్ చైతన్య రెడ్డి, అప్పటి జైలు పర్యవేక్షణాధికారి ప్రకాష్, డీఎస్పీ నాగరాజు, సీఐ ఈశ్వరయ్యలు ఇబ్బంది పెట్టారని ఈనెల 3వ తేదీ పులివెందుల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు ఆ నలుగురిపై కేసు నమోదు చేశారు. ఈ మేరకు ఆ కేసుకు సంబంధించి వారం రోజుల కిందట దస్తగిరిని కేంద్ర కారాగారంలో జైలు అధికారులు విచారించారు. డీఎస్పీ నాగరాజు, సీఐపై కూడా కేసు నమోదు కావడంతో ఆ కేసుకు సంబంధించి వివరాలను తెలుసుకునేందుకు పోలీసులు దస్తగిరిని విచారించారు. ఈ మేరకు డీఎస్పీ, సీఐ వైఖరిపై దస్తగిరి, ఆయన భార్యను పోలీసులు ప్రశ్నించారు.
కస్టోడియల్ టార్చర్ కేసులో సొంతంగా దర్యాప్తు - నిందితులను వదిలిపెట్టేది లేదు: రఘురామ
నగరపాలక సంస్థ అధికారుల నిర్లక్ష్యంతో మురికి కూపంలా పెన్నానది