thumbnail

ధర్మవరం అభివృద్ధి కోసం టికెట్ త్యాగం చేశా - సత్యకుమార్​ను గెలిపిద్దాం: పరిటాల శ్రీరామ్ - Paritala Sriram on dharmavaram seat

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 30, 2024, 9:37 PM IST

Paritala Sriram comments : ధర్మవరం అభివృద్ధి కోసం టికెట్ త్యాగం చేశానని తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్​ఛార్జి పరిటాల శ్రీరామ్ అన్నారు. ధర్మవరం నియోజకవర్గ అభివృద్ధి కోసం తాను ఎప్పుడూ ముందు ఉంటానని పొత్తులలో భాగంగా ధర్మవరం టికెట్ బీజేపీ అభ్యర్థి సత్యకుమార్​కు కేటాయించారని తెలిపారు. బీసీ వర్గానికి చెందిన సత్యకుమార్ ధర్మవరంలో గెలిచే విధంగా తాను ముందుండి నడిపిస్తానని పరిటాల శ్రీరామ్ హామీ ఇచ్చారు. 

Dharmavaram Assembly Seat : ధర్మవరం బత్తలపల్లి తెలుగుదేశం పార్టీ కార్యాలయాల్లో నాయకులు కార్యకర్తలు సమావేశం నిర్వహించారు. అయిదేళ్ల క్రితం ధర్మవరంలో తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకునేందుకు భయపడేవారని, తాను నియోజకవర్గ ఇన్​ఛార్జిగా బాధ్యతలు తీసుకొని పార్టీని ముందుకు నడిపించి బలోపేతం చేశానన్నారు. ఈ రోజు ధర్మవరంలో టీడీపీ గెలిచే స్థాయికి తీసుకునివచ్చానని తెలిపారు. చేనేత కేంద్రమైన ధర్మవరం మరింత అభివృద్ధి చెందాలంటే సత్యకుమార్​ను గెలిపించాలని పరిటాల శ్రీరామ్ పిలుపునిచ్చారు. పార్టీ ఏదైనా సరే సత్యకుమార్​లో తనను చూసి ఓటు వేయాలని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ఇంటింటికీ తిరిగి ఓటు వేయించాలని కోరారు.  

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.