LIVE : ప్రధాని మోదీ 'పరీక్షా పే చర్చ' కార్యక్రమం - Pariksha Pe Charcha 2024 LIVE
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/29-01-2024/640-480-20616172-thumbnail-16x9-modi.jpg)
![ETV Bharat Telangana Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/telangana-1716536068.jpeg)
Published : Jan 29, 2024, 12:40 PM IST
|Updated : Jan 29, 2024, 1:10 PM IST
Pariksha Pe Charcha 2024 LIVE : పరీక్షా పే చర్చ కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. దిల్లీలోని భారత మండపంలో విద్యార్థులతో మాట్లాడారు. ఏడేళ్లుగా పరీక్షా పే చర్చ కార్యక్రమం నిర్వహిస్తున్నామని అన్నారు. పరీక్షలు రాసే చిన్నారులకు సూచనలు, సలహాలు ఇచ్చారు. "పరీక్షల సమయంలో ఒత్తిడి లేకుండా విద్యార్థులు చూసుకోవాలి. పరీక్షల వేళ తల్లిదండ్రులు కూడా ఒత్తిడి పెంచకూడదు. ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేలా ఉపాధ్యాయులు చూడాలి. రోజుకు 15 గంటలు చదవాలని ఒత్తిడి చేయడం మంచిది కాదు. పరీక్షల ఒత్తిడి అధిగమించేందుకు ప్రతి ఒక్కరూ సొంత పద్ధతులు పాటించాలి. చదివే సమయాన్ని క్రమంగా పెంచుకుంటూ వెళ్లాలి. రాత్రి నిద్ర పోకుండా చదవడం వల్ల ఒత్తిడి మరింత పెరుగుతుంది. పిల్లలను వారి స్నేహితులతో పోల్చి ఇబ్బంది పెట్టడం సరికాదు. చిన్న చిన్న లక్ష్యాలు పెట్టుకుని ముందుకెళ్లాలి. పిల్లల మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉండాలి. పక్కవారితో పోల్చడం వల్ల పిల్లల్లో అసూయ, ద్వేషాలు పెరుగుతాయి. పోల్చడం వల్ల పిల్లల్లో మానసిక ఎదుగుదల సరిగా ఉండదు. తల్లిదండ్రుల లక్ష్యాలను పిల్లలపై రుద్దడం సరికాదు." అని మోదీ అన్నారు.