బామ్మా మజాకా - వినాయకుడి మండపంలో టిక్​టాక్ బామ్మ డ్యాన్స్ అదుర్స్ - Old Woman Dance Viral Video - OLD WOMAN DANCE VIRAL VIDEO

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Sep 15, 2024, 4:56 PM IST

Old Woman Dance Viral Video In Hyderabad : ఓ బామ్మ 78 ఏళ్ల వయసులోనూ తన డ్యాన్స్‌తో అదరగొడుతోంది. హైదరాబాద్‌లో టిక్ టాక్ బామ్మగా పిలుచుకునే విజయలక్ష్మి (78) ఎల్లారెడ్డిగూడలో నివాసం ఉంటోంది. వినాయకుడి మండపం వద్ద ఆ బామ్మ వేసిన స్టెప్పులు అక్కడున్న వారిని తన అభిమానులుగా మార్చేసింది. కాలనీవాసులు సరదాగా ఆ బామ్మతో కలిసి డ్యాన్స్ ​చేశారు.

టిక్‌టాక్‌ ఉన్న సమయంలో ప్రతి రోజు డ్యాన్స్​ చేసి అందులో పోస్ట్ చేసేది. రీల్స్ ద్వారా దాదాపు 80 వేల మంది అభిమానులను సంపాదించుకొంది. టిక్‌టాక్‌ యాప్ తొలగించిన అనంతరం బామ్మ ఇన్‌స్టాగ్రామ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం ఆమెను ఇన్‌స్టాలో దాదాపు 22 వేల మందికి పైగా అనుసరిస్తున్నారు. ఆ బామ్మ తన ఇన్​స్టాలో 3300లకు పైగా పోస్టులు పెట్టింది. ఈ వయసులోనూ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆనందంగా ఉండటానికి  కారణం ప్రతి రోజు యోగా చేయడమే అంటోంది ఈ టిక్‌టాక్‌ బామ్మ.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.