టీడీపీ ప్రచారాన్ని అడ్డుకున్న అధికారులు- 'ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం' - Officials Stopped TDP Campaign

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 20, 2024, 3:08 PM IST

Officials Stopped TDP Leader Amarnath Election Campaign: చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలం బేలుపల్లిలో తెలుగుదేశం నేత అమర్నాథ్‌ రెడ్డి (TDP leader Amarnath Reddy) ఎన్నికల ప్రచారానికి అనుమతిలేదంటూ ఎంపీడీవో రాజేశ్‌(MPDO Rajesh) అడ్డుకున్నారు. నిబంధనలను ఉల్లంఘించేలా ఎటువంటి కార్యక్రమం చేపట్టలేదన్న అమర్నాథ్​ రెడ్డి తెలిపారు. వాహనాల అనుమతి కోసం ముందుగానే ఆర్డీవోకు దరఖాస్తు చేసుకున్నామని తెలిపారు. అనుమతులు ఇంకా రాకపోవడంతో ఎలాంటి ప్రచార వాహనాల, జెండాలు లేకుండా ఆయన పర్యటన సాగించారు. 

అధికార పార్టీ నేతల ఒత్తిడితో కార్యక్రమాన్ని అడ్డుకుంటున్నారని,  అధికారుల ఒత్తిడితో ప్రచారానికి అనుమతి ఇవ్వకపోవడంపై అమర్నాథ్ మండిపడ్డారు. ఇది ప్రజాస్వామ్య విరుద్ధమని అన్నారు. ఈ క్రమంలో అనుమతి కోసం వినతి పత్రం సమర్పించాలని ఆర్డీవో కోరగా అమర్నాథ్ రెడ్డి వెంటనే వినతిపత్రం సమర్పించారు. అయినా అనుమతి వచ్చేందుకు కొంత సమయం పడుతుందని అంతవరకు కార్యక్రమాన్ని చేపట్టరాదంటూ అధికారులు తెలిపారు. అధికారులను ఇబ్బంది పెట్టే విధంగా నడుచుకోమని కార్యక్రమాన్ని అనుమతి వచ్చేంతవరకు వాయిదా వేస్తామని అమర్నాథ్ రెడ్డి స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.