విద్యుత్ కాంతుల నడుమ సాగర్ జల సవ్వడి - ఆకట్టుకుంటున్న నైట్ విజువల్స్ - Nagarjuna Sagar Dam Visuals
🎬 Watch Now: Feature Video
Nagarjuna Sagar Dam Stunning Visuals : నాగార్జునసాగర్ జలాశయానికి భారీ వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో అధికారులు 26 క్రస్ట్ గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. దాదాపుగా జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం చేరుకునే అవకాశం ఉండడంతో ఉదయం నుంచి 26 గేట్ల ఎత్తి నీటిని దిగువనున్న కృష్ణమ్మకు వదులుతున్నారు. రాత్రి సమయంలో విద్యుత్ దీపాలంకరణలో నాగార్జునసాగర్ అందాలు ఆకర్షణీయంగా కనిపిస్తోంది. విద్యుత్ కాంతుల నడుమ సాగర్ జల సవ్వడి పర్యాటకులను ముగ్ధులను చేస్తోంది.
ఇప్పటికే రాష్ట్ర నలుమూలల నుంచి పర్యాటకులు బారులు తీరుతున్నారు. ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ సాగర్ జలాశయాన్ని తిలకిస్తూ కేరింతలు పెడుతున్నారు. మరోవైపు ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 586 అడుగులకు చేరుకుంది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.50 టీఎంసీలు కాగా ప్రస్తుతం 300.32 టీఎంసీలుగా ఉంది. జలాశయానికి ఇన్‌ఫ్లో 3,94,683 క్యూసెక్కుల నీరు వస్తోంది. ఔట్‌ఫ్లో 3,14,544 క్యూసెక్కులుగా ఉంది.