శిలాఫలకంపై లేని ఎమ్మెల్యే పేరు - ఆనం అభిమానుల ఆగ్రహం - Officials Ignored MLA Name
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 12, 2024, 6:00 PM IST
Officials Ignored MLA Name on Inauguration Plaque in Venkatagiri : తిరుపతి జిల్లా వెంకటగిరి పురపాలక సంఘం పరిధిలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ శిలాఫలకంపై ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి పేరు లేకపోవడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. ఇందుకు పురపాలక సంఘం అధికారులు ప్రొటోకాల్‌ను విస్మరించడమే కారణం అంటూ ఆనం అభిమానులు మండిపడ్డారు. ఈ రోజు (మంగళవారం) స్థానిక నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో రూ.7 కోట్ల వ్యయంతో గడప గడప కోటాలో చేసిన వివిధ అభివృద్ధి పనుల శిలఫలకాన్ని ప్రారంభించారు.
అయితే ఆ శిలఫలకంపై ఎక్కడ కూడా ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి పేరు కనిపించలేదు. అధికార పదవులు కల్గిన అందరి పేర్లతో పాటు పలువురు ఎమ్మెల్సీలు, నామినేట్ పదవుల్లో ఉన్న వారి పేర్లను కూడా రాయించిన పురపాలక అధికారులు ఆయన పేరు మాత్రం విస్మరించారు. వైసీపీకి దూరమై టీడీపీలో చేరినందుకే ఎమ్మెల్యే పేరు లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.