ఓట్ల కోసం కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్ల బూటకం : ధర్మపురి అరవింద్ - BJP MP Arvind Election Campaign - BJP MP ARVIND ELECTION CAMPAIGN
🎬 Watch Now: Feature Video
Published : May 5, 2024, 2:20 PM IST
BJP MP Candidate Arvind Fires On Congress : ఓట్ల కోసం కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్ల బూటకం నెత్తిన ఎత్తుకుందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. దేశానికి పట్టిన దరిద్రం కాంగ్రెస్ పార్టీ అని విమర్శించారు. నిజామాబాద్‌లో విద్యావంతులు, మేధావుల ఆత్మీయ సమావేశంలో ఎంపీ ధర్మపురి అర్వింద్ పాల్గొన్నారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ వక్ఫ్ చట్టం తెచ్చిందని ఎవరికైనా భూ సమస్య వస్తే వక్ఫ్ ట్రిబ్యునల్‌కు వెళ్లాలని, వేరే కోర్టులు కనీసం అప్పీలు కూడా అవకాశం లేకుండా కాంగ్రెస్ చేసిందన్నారు.
2005లో కమ్యునల్ వయోలెన్స్ బిల్ పెట్టాలని కాంగ్రెస్ భావించిందని బీజేపీ కొట్లాడి దాన్ని అడ్డుకుందని గుర్తు చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ ఎన్నికల ప్రణాళికలో ఇలాంటి అంశాలు ఎన్నో ఉన్నాయన్నారు. సెంట్రల్ వర్శిటీలను మైనార్టీ స్టేటస్ ఇచ్చి రిజర్వేషన్లు తీసేసిన ఘనత సైతం కాంగ్రెస్‌దే అన్నారు. దేశంలో అవినీతి మచ్చ లేకుండా బీజేపీ పాలన సాగుతోందని, కీలకమైన ఈ ఎన్నికలో బీజేపీకి మద్దతు ఇవ్వాలని అర్వింద్ విజ్ఞప్తి చేశారు.