అభివృద్ధి అంటే చంద్రబాబు, జగన్​ అంటే విధ్వంసం : టీడీపీ నేత నెట్టెం రఘురాం - ntr district

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 19, 2024, 3:33 PM IST

Nettem Raghuram Comment on CM Jagan : అభివృద్ధికి మారుపేరు చంద్రబాబు, విధ్వంసానికి ప్రతిరూపం సీఎం జగన్​ అని ఎన్టీఆర్​ జిల్లా టీడీపీ అధ్యక్షుడు నెట్టెం రఘురాం​ వ్యాఖ్యానించారు. ఆదివారం రాప్తాడులో జరిగిన సిద్ధం సభలో సీఎం జగన్​ మోహన్​ రెడ్డి చేసిన వ్యాఖ్యలను విమర్శించారు. ప్రతిపక్ష నాయకులను పెత్తందారులు అని విమర్శిస్తే అది నిజం అవుతుందా అని ప్రశ్నించారు. దేశంలోనే అత్యంత ధనిక ముఖ్యమంత్రి జగన్​ మోహన్​ రెడ్డి అయితే పెత్తందారులు ప్రతిపక్షనాయకులు ఎలా అవుతారని విమర్శించారు. మేలు చేసేవారు ఎవరో, దోపిడీ చేసేవారు ఎవరో ప్రజలకు బాగా తెలుసు అని పేర్కొన్నారు.

సీఎం జగన్​ రాప్తాడు సిద్ధం సభలో మాట్లాడిన ప్రతి మాట అబద్ధమని నెట్టెం రఘురామ్​ పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చి అయిదేళ్ల అన్యాయాలు, అవినీతి, దోపిడీ, దౌర్జన్యాలతో రాజ్యం ఏలుతున్నారని ఆరోపించారు. ఈ ఐదేళ్ల కాలంలో పేద ప్రజల్ని పట్టించులేదని పేర్కొన్నారు. రాష్ట్రంలో పరిశ్రమలు రాకుండా అడ్డుకట్ట వేశారని వ్యాఖ్యానించారు. రానున్న ఎన్నికల్లో వైఎస్సార్సీపీని ఇంటికి పంపించాడని ప్రజలు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.