నెహ్రూ జూపార్కులో ఘనంగా ఏనుగుల దినోత్సవం - గజరాజులకు పసైందన విందు భోజనం - National Elephant Day Celebrations - NATIONAL ELEPHANT DAY CELEBRATIONS
🎬 Watch Now: Feature Video
Published : Aug 13, 2024, 3:41 PM IST
National Elephant Day Celebrations In Nehru julagical Park : జాతీయ ఏనుగుల దినోత్సవాన్ని (ఆగస్ట్ 12) నెహ్రూ జూలాజికల్ పార్క్‌లో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా జూ పార్క్‌లో జంబో మీల్‌తో వనజ, ఆశా, సీత, విజయ్ అనే పేర్లు గల ఏనుగులకు భోజనం ఏర్పాటు చేశారు. సలాడ్, చెరుకు ముక్కలు, రాగి, రైస్, పండ్లు, కీర, క్యారెట్, కూరగాయలు, మొలకలు, మొక్కజొన్నలు, బెల్లం కొబ్బరి, పచ్చిగడ్డి, అరటి పండ్లతో ఆహారం ఏర్పాటు చేయగా, అవి తృప్తిగా ఆరగించాయి.
National Elephant Day Celebrations 2024 : ప్రత్యేకంగా తయారు చేయించిన కేక్‌ను జూపార్క్ సిబ్బంది ఏనుగులతో కట్ చేయించారు. అనంతరం అధికారులు, మావటిలు ఏనుగులతో ఫొటోలు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో నెహ్రూ జూలాజికల్ పార్కు క్యూరేటర్ డాక్టర్ సునీల్ ఎస్.హిరేమత్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం ఆగస్టు 12వ తేదీన ప్రపంచ ఏనుగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.