'నా భర్తను నా వద్దకు చేర్చండి' - నార్సింగ్ పోలీసులకు సినీనటి లావణ్య విజ్ఞప్తి - Lavanya Statement on Raj Tarun Case - LAVANYA STATEMENT ON RAJ TARUN CASE

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Jul 13, 2024, 10:32 PM IST

Lavanya Raj Tarun Case Update : తనతో సహజీవనం సాగిస్తున్న సినీ నటుడు రాజ్‌తరుణ్‌ మరో మహిళకు దగ్గర అవ్వడమే కాకుండా తనను  కొందరు బెదిరిస్తున్నట్లు నటి లావణ్య ఇటీవల నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. తాజాగా లావణ్య వాంగ్మూలాన్ని నార్సింగ్​ పోలీసులు నమోదు చేశారు. ఆమె నుంచి ఎఫ్ఐఆర్ ఆధారంగా వివరాలు సేకరించారు. సినీ నటి మాలిక మల్హోత్రా, ఆమె సోదరుడు తనను ఎలా భయపెట్టారో పోలీసులకు వివరించింది. 

ఈ మేరకు లావణ్య ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మళ్లీ విచారణ ఉంటుందని, పిలిచినప్పుడు రావాలని పోలీసులు ఆమెకు సూచించారు. ఈ సందర్భంగా నటి లావణ్య మీడియాతో మాట్లాడారు. ఎఫ్​ఐఆర్​లో నమోదు చేసిన వాంగ్మూలాన్ని, వీడియో ఫుటేజీని పోలీసులు తీసుకున్నారని లావణ్య తెలిపారు. అలాగే కేసు విత్​డ్రా చేసుకోవాలంటూ సినీ నటి మాలిక మల్హోత్రాకు సంబంధించిన వ్యక్తులు రూ. 5 కోట్లు ఆఫర్​​ చేశారని చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.