LIVE విజయనగరంలో నారా లోకేశ్ ఎన్నికల సమరభేరి - ప్రత్యక్ష ప్రసారం - NARA LOKESH MEETING - NARA LOKESH MEETING

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 7, 2024, 5:22 PM IST

Updated : May 7, 2024, 6:52 PM IST

NARA LOKESH ELECTION CAMPAIGN in Vizianagaram live: నారా లోకేశ్ ఎన్నికల ప్రచారం ప్రస్తుతం విజయనగరం జిల్లాలో కొనసాగుతోంది. ఈసారి ఎన్నికల్లో 40 లక్షల మంది తొలిసారి ఓటేయబోతున్నారని యువ తీర్పుతోనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉందని అన్నారు. కూటమి అభ్యర్థులను గెలిపించి అభివృద్ధికి బాటలు వేయాలని పిలుపునిచ్చారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలి సంతకం డీఎస్సీ ప్రకటనపైనే ఉంటుందని చెప్పారు. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో 20 లక్షల ఉద్యోగాల కల్పనపై ఆయన యువకులతో అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఖాళీగా ఉన్న ఉద్యోగాల్ని ఐదేళ్లలో భర్తీ చేస్తామని భరోసా ఇస్తున్నారు. యువత కలలకు రెక్కలు తొడుగుతామని నారా లోకేశ్‌ యువతరానికి భరోసా ఇచ్చారు. ప్రజా ఆకాంక్షలకు అనుగుణంగానే కూటమి మ్యానిఫెస్టో తయారైందని అన్నారు. కర్నూలు జిల్లాలో ఓర్వకల్లు ఎయిర్‌పోర్టు, జైన్‌ ఇరిగేషన్‌, మెగా సీడ్‌ పార్కు, సోలార్‌ పవర్‌, ఉర్దూ యూనివర్సిటీ టీడీపీ తెచ్చిందని గుర్తు చేశారు. జగన్‌ మూడు ముక్కలాటతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని విమర్శించారు. ప్రస్తుతం విజయనగరంలో నారా లోకేశ్ యువగళం సభలో ప్రసంగిస్తున్నారు. ప్రత్యక్ష ప్రసారం మీ కోసం. 
Last Updated : May 7, 2024, 6:52 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.