భువనేశ్వరికి గుండెనొప్పి వచ్చేలా చంద్రబాబు చేసిన పనేంటీ? - Nara Bhuvaneswari Comments

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Feb 17, 2024, 7:09 PM IST

Nara Bhuvaneswari Comments about Saree : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) సతీమణి నారా భువనేశ్వరి (Nara Bhuvaneswari) ఇటీవల ఆంధ్రప్రదేశ్​లోని పలు నియోజకవర్గాల్లో 'నిజం గెలవాలి' కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం, రాప్తాడు నియోజకవర్గాల్లో భువనేశ్వరి చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతున్నాయి. గతంలో చంద్రబాబు చేసిన పనితో తనకు హార్ట్ ఎటాక్ వచ్చినంత పని అయిందంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు నవ్వులు పూయించారు. ఇంతకీ అవి ఏంటీ అనేదేగా మీ సందేహం. 

Chandrababu Gift to Bhuvaneswari : వివరాల్లోకి వెళ్తే, కొన్ని సంవత్సరాల క్రితం ఈ ఘటన జరిగిందని భువనేశ్వరి వివరించారు. చాలా మంది భర్తలు వారి భార్యకు విలువైన వస్తువులు తీసుకొస్తారు, మీరు మాత్రం ఏం తీసుకొనిరారని, ఎందుకని చంద్రబాబును భువనేశ్వరి అడిగారని అన్నారు. ఆ మాటలను గుర్తు పెట్టుకొని మరీ ఓ రోజు చంద్రబాబు చీర తీసుకొని వచ్చారని చెప్పారు. అయితే దానిని చూడగానే భువనేశ్వరికి హార్ట్ అటాక్ వచ్చినంత పని అయిందని తెలిపారు. ఎందుకంటే ఆ చీర అంత ఘోరంగా ఉందంటూ నవ్వులు పూయించారు. అయినా సరే తన భర్త తీసుకొచ్చిన చీరను జాగ్రత్తగా బీరువాలో దాచుకున్నట్లు ఆమె పేర్కొన్నారు. తన భర్తకు ఎప్పుడూ ప్రజాసేవే ధ్యాసే తప్పా, కుటుంబం గురించి ఆలోచన తక్కువ అనేది తన ఉద్దేశమని భువనేశ్వరీ స్పష్టం చేశారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.